Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : రోడ్డుమీదకి వచ్చిన దీదీ ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   27 March 2020 5:27 AM GMT
కరోనా ఎఫెక్ట్ : రోడ్డుమీదకి వచ్చిన దీదీ ఏంచేశారంటే ?
X
భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో .. దాన్ని అరికట్టాలంటే సోషల్ డిస్టెన్స్ ఒక్కటే మార్గం అని - అందరూ సోషల్ డిస్టెన్స్ ని తప్పకుండా పాటించాలని దేశ ప్రధాని మోడీ - అన్ని రాష్ట్రాల సీఎంలు మంత్రులు - ప్రముఖులు అందరు ఇంట్లోనే ఉండాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్‌ ప్రకటించినా, ఇంకా కొన్ని చోట్ల జనాలు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు. రోడ్డు పైకి వచ్చేవారు కొందరు సరైన కారణాలతో వచ్చినప్పటికీ ...చాలామంది రోడ్డు పై ఏంజరుగుతుందో తెలుసుకోవడానికి వస్తున్నారు.

దీనితో ఈ సోషల్ డిస్టెన్స్ పై అవగాహన కల్పించేందుకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. కూరగాయల మార్కెట్లో ఓ ఇటుకరాయి తీసుకొని, స్వయంగా సామాజిక దూరం పాటించేలా స్వయంగా కొలతలతో సర్కిల్‌ గీసి ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు లో ఉన్న నేపథ్యంలో ..సీఎం మమత గురువారం రాజధాని కోల్‌ క‌తా వీధుల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె అధికారుల‌తో క‌లిసి కోల్‌ క‌తాలోని ఒక కూరగాయ‌ల మార్కెట్ కు వెళ్లారు. అక్క‌డ కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ వ్యాపారులకు - ప్రజలకు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా సామాజిక దూరం ఎలా పాటించాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఆ తరువాత స్వయంగా ఇటుక రాయితో వృత్తాలను గీసి దానిలో మాత్రమే నిలబడాలని , అందరు తప్పకుండా పాటించాలని సూచించారు .ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పోస్టు చేస్తూ ‘నో వర్డ్స్‘ అంటూ కామెంట్ చేసారు. కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 733కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 532,263 మంది కరోనా భారిన పడగా ... 24,090 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు.