Begin typing your search above and press return to search.

బడ్జెట్... బాయ్ కాట్

By:  Tupaki Desk   |   30 Jan 2017 7:53 AM GMT
బడ్జెట్... బాయ్ కాట్
X
బడ్జెట్ సమావేశాలు మొదలుకాకముందే మోడీ ప్రభుత్వానికి సెగ మొదలైంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పించే ఫిబ్రవరి 1వ తేదీన తమ పార్టీ ఎంపీలు హాజరు కాబోరంటూ తృణమూల్ కాంగ్రెస్ డిక్లేర్ చేసింది. ఆ రోజు సరస్వతీ పూజ ఉన్నందున తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు రాబోరని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. జనవరి 31 నుంచి సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఒక రోజు ముందే ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు.

అంతేకాదు.. బడ్జెట్ కు ముందుగా ఈ రోజు నిర్వఃహించబోయే అఖిలపక్ష సమావేశానికి కూడా ఆ పార్టీ ఎంపీలు రావడం లేదు. కాగా తృణమూల్ ఈ సమావేశాలకు రాకపోవడానికి సరస్వతి పూజ అసలు కారణం కాదని... ఆమెకు ప్రభుత్వంతో నప్పకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నోట్ల రద్దు తరువాత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తృణమూల్ కాంగ్రెస్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ బడ్జెట్ ను బహిష్కరించాలని నిర్ణయించుకుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు బడ్జెట్ ను ముందుకు తీసుకురావడం, రైల్వే బడ్జెట్ ను సైతం సాధారణ బడ్జెట్ లో విలీనం చేయడం వంటి అంశాలనూ మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే మమత ఈ బాయ్ కట్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/