Begin typing your search above and press return to search.

దీదీకి మ‌ళ్లీ పొలిటిక‌ల్ తిప్ప‌లే.. అడ్డంగా దొరికిన నేత‌!

By:  Tupaki Desk   |   13 Jan 2023 3:29 AM GMT
దీదీకి మ‌ళ్లీ పొలిటిక‌ల్ తిప్ప‌లే.. అడ్డంగా దొరికిన నేత‌!
X
బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఉర‌ఫ్ దీదీ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. గ‌తంలో ఒక‌సారి.. సొంత మంత్రి ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లుగా పోసి ఉన్న ప‌రిస్థితిలో కేంద్ర బృందాలు ఆయ‌న‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీని ఆమె శ‌ర‌ణు జొచ్చారు. ప్ర‌భుత్వ ప‌రువును కాపాడుకునేందుకు కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లి మ‌రీ.. మోడీని క‌లిసి వ‌చ్చారు. ఇలా.. దాని నుంచిఅంతో ఇంతో బ‌య‌ట‌ప‌డ్డారో మ‌ళ్లీ ఇప్పుడు చిక్కుకు పోయారు.

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇళ్లు, ఫ్యాక్టరీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారు లు దాడులు చేశారు. ఈ సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ మొత్తంలో రూ.11 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో దీదీ ప్ర‌భుత్వంపై విప‌క్షం బీజేపీ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది.

విష‌యం ఏంటంటే..

మాజీ మంత్రి, టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్‌ హొస్సేన్‌ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. రాజ‌ధాని కోల్‌కతా, ముర్షిదాబాద్‌లోని దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.

జాకీర్‌ ఇళ్లు, ఆయన బీడీ ఫ్యాక్టరీ, నూనె మిల్లు, రైస్‌మిల్లుల్లో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలను ఐటీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.11కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు.

ఈ వ్య‌వ‌హారం వెలుగు చూడ‌గానే బీజేపీ విమర్శలు గుప్పిచ్చింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ స్పందిస్తూ.. ''ఆ డబ్బు లెక్కల్లో చూపించిందా లేదా అన్నది ఆలోచించాలి. దీనిపై మేం మాట్లాడ దల్చుకోలేదు. అయితే జాకీర్‌ సంపన్న వ్యాపారవేత్త. ఆయన కింద చాలా మంది ఉద్యోగం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి'' అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.