Begin typing your search above and press return to search.

బీజేపీ కి అమ్ముడుపోయిన హైదరాబాదీని తరిమి కొట్టండి..! మమత ఫైర్​

By:  Tupaki Desk   |   3 April 2021 4:01 AM GMT
బీజేపీ కి అమ్ముడుపోయిన హైదరాబాదీని తరిమి కొట్టండి..! మమత ఫైర్​
X
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పశ్చిమబెంగాల్ ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది. అందుకు కారణం అక్కడ ఫైర్​ బ్రాండ్​ మమతా బెనర్జీ ఉండటమే. పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలు కొట్టిన మమత దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్ర లిఖించారు. అయితే ఇప్పుడు ఆమెను ఓడించి మరో రికార్డును క్రియేట్​ చేయాలని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. మమతా బెనర్జీని గద్దె దించాలని బీజేపీ పక్కా ప్లాన్​ అమలు చేస్తున్నది. మమత కూడా బీజేపీని దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నది.

ఇదిలా ఉంటే మమతా బెనర్జీకి కుడి భుజంగా ఉన్న సువేందు అధికారి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే బెంగాల్​ రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాక సువేందు అధికారిపై నందిగ్రామ్ నియోజకవర్గంలో నేరుగా మమతా బెనర్జీ పోటీ చేయడం మరింత హైలెట్​ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా మమతా బెనర్జీ హైదరాబాద్​ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీపై పరోక్ష ఆరోపణలు చేశారు. ‘ఓ హైదరాబాదీ బీజేపీకి అమ్ముడు పోయాడు.బీజేపీ వాళ్ల దగ్గర డబ్బుల సంచులు తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చి బెంగాల్​ ఉనికిని దెబ్బతీయాలని చూస్తున్నాడు. బెంగాలీలు అతడి ట్రాప్​లో పడొద్దు. అతడిని ఇక్కడి ప్రజలు తరిమికొట్టాలి’ అంటూ మమతా పిలుపునిచ్చారు.

పశ్చిమ బెంగాల్​లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎనిమిది దశల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో 60 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. ఏప్రిల్-6న మూడో దశలో భాగంగా 31 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం కూచ్‌బెహ‌ర్ జిల్లాలోని దినాహతాలో సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై తనదైన స్టయిల్​లో విరుచుకుపడ్డారు. వాళ్లపై నిప్పులు చెరిగారు.

'మోదీ జీ మీరు మమతా బెనర్జీని అణగదొక్కుతానని, నియంత్రిస్తానని అంటున్నారు. ముందుగా మీ సహచరుడు అమిషాను నియంత్రించండి.. నేను నందిగ్రామ్​ లోనే పోటీచేసే గెలిచి తీరుతా. వేరే నియోజకవర్గంలో పోటీచేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎక్కడ పోటీచేయాలో చెప్పడానికి నేను మీ పార్టీలో లేను. ఏమన్నా చెప్పాలనుకుంటే మీ పార్టీ వాళ్లకు చెప్పుకోండి. ఇక్కడ ఉంది దీదీ’ అంటూ ఆమె ఓ రేంజ్​ లో ఫైర్​ అయ్యారు.అయితే ఇప్పటికే విడుదలైన సర్వేలో రాష్ట్రంలో తృణమూల్​ గెలుపు ఖాయమని తేలింది. అయితే బీజేపీ కూడా గణనీయమైన సీట్లు సాధిస్తుందని కొన్ని సర్వేలు చెప్పాయి. ఇదిలా ఉంటే బెంగాల్​లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తున్నది.