Begin typing your search above and press return to search.

ట్రంప్ కూడా మోడీలా దారుణంగా వ్యవహరించలేదట

By:  Tupaki Desk   |   7 April 2021 11:30 AM GMT
ట్రంప్ కూడా మోడీలా దారుణంగా వ్యవహరించలేదట
X
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పోల్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ చేసిన దారుణాలకు మించినట్లుగా మోడీ తీరు ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ విచ్చలవిడిగా డబ్బుల్ని ఖర్చు చేస్తుందన్నారు.

తాజాగా జరిగిన పోలింగ్ పై ఆమె స్పందిస్తూ.. బీజేపీకే ఓటు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తనకువందకు పైగా ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. మూడో దశ ఎన్నికల పోలింగ్ లో.. బీజేపీకో ఓట్ దో అంటూ ఓటర్లపై దాడి చేసినట్లుగా తనకు కంప్లైంట్లు అందుతున్నాయన్నారు. కీలకమైన పోలింగ్ వేళ.. సీఆర్ పీఎఫ్.. బీఎస్ఎఫ్.. సీఐఎస్ఎఫ్.. ఐటీబీపీ బలగాలు చేసిన దౌర్జన్యాల గురించి కేంద్రం ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చినా.. వారు పట్టించుకోలేదన్నారు.

బీజేపీ అగ్రనేతల సభలకు ప్రజలు రావట్లేదని.. దీంతో.. వారు ఢిల్లీలో కూర్చొని ఈ దారుణాలకు తెర తీసినట్లుగా ఆమె ఆరోపించారు. కేంద్ర బలగాలు బీజేపీకి మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదన్నారు.

పెద్ద పెద్ద హోటళ్లలోని అన్ని రూముల్ని బుక్ చేసుకున్నారని.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్నారు. మతం పేరుతో ఊచకోతకు పాల్పడిన వారున్న పార్టీ బీజేపీ అంటూ ఫైర్ అయ్యారు. గుజరాత్.. ఢిల్లీ.. అసోం.. యూపీలో మతం పేరుతో హత్యలు చేశారని.. ఇప్పుడు బెంగాల్ కు వచ్చినట్లుగా మమత మండిపడ్డారు. ఈ విమర్శలు.. ఆరోపణలు ఎలా ఉన్నా.. బెంగాల్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది తేలాలంటే మాత్రం మే 2 వరకు వెయిట్ చేయక తప్పదు.