Begin typing your search above and press return to search.
రాజకీయాలను మించిన మమతానుబంధం
By: Tupaki Desk | 3 Nov 2022 5:30 PM GMTరాజకీయాలు అంటేనే బంధాలు అన్నీ మూలకు చేరుతాయి. రక్త సంబంధాలు కూడా ఏమీ కాకుండా పోతాయి. అలాంటిది వేరు వేరు పార్టీల అధినేతలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక చోట కలసి రాజకీయాలను మించి చాలా విషయాలు మాట్లాడుకున్నామంటే అది కచ్చితంగా వర్తమానంలో సంచలనమే అవుతుంది. ఎందుకంటే రాజకీయమే తప్ప మరో ఊసు లేని ఆధునిక భారతావనిలో ఈ రకమైన కలయికను ఎవరైనా ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూడాల్సిందే.
తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ రోజున అందరికీ నచ్చేస్తున్నాడు. ఆయన దిగ్గజ తమిళ నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడు. తండ్రి అడుగుజాడలలో నడచి రాజకీయాన్ని పుణికి పుచ్చుకున్న స్టాలిన్ తండ్రిని మించిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలీ అంటే అందరి వాడుగా మారుతున్నారు. ఆయన ఏణ్ణర్ధం నుంచి సీఎం గా ఉన్నారు. తమిళనాడులో సైతం రాజకీయాల సరిహద్దులను దాటి అన్ని పక్షాలను కలుపుకుని పోతున్నారు.
తాము అధికారంలోకి వచ్చామూ అంటే రాజకీయ ప్రత్యర్ధులను వేధించడానికి కాదు అన్నది ఆయన సరిగ్గా అర్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాలను సైతం కలుపుకుని ప్రజలకు ప్రగతి దారులు చూపించాలన్న దృఢ సంకల్పంతో స్టాలిన్ ఉన్నారు. గత ప్రభ్తువం చేసిన మంచిని అలాగే కొనసాగిస్తున్నారు. వారు పెట్టిన పధకాలను వారి పేర్లతోనే ఉంచుతున్నారు. ఇక ప్రత్యర్ధుల మీద వేధింపులు అన్న ప్రశ్నకు తావు లేకుండా చూసుకుంటున్నారు.
అందుకే ఆయన ఈ రోజు జాతీయ రాజకీయ నాయకులను కూడా ఆకర్షిస్తున్నారు. కలకత్తా కాళిగా పేరు గడించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరి మరీ తమిళనాడు సీఎం ని కలిశారు అంటే ఆయన మంచితనానికి అదే నిదర్శనంగా చూదాలి. ఆయనను తన సోదరుడిగా మమత భావించి రాజకీయాలకు అతీతమైన మమతానుబంధాన్ని బయటపెట్టారు.
అందుకే మీడియా ఈ భేటీ గురించి అడిగినపుడు ఆమె చెప్పిన మాట రాజకీయాలకు మించిన పెద్ద విషయాలనే మాట్లాడుకున్నామని చెప్పారు. తమ భేటీలో ఎక్కడా రాజకీయాల ప్రస్థావన రాలేదని మమత చెప్పడమూ విశేషం. అయినా ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే కాదు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అని మమత అనడమూ ఆసక్తికరమే. ఇక తన ఇంటికి వచ్చిన సోదరిని స్టాలిన్ కూడా ఘనంగా సమాదరించి ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకున్నారు.
ఇక స్టాలిన్ ని మమత పశ్చిమ బెంగాల్ రావాలని ఆహ్వానించారు. మరి ఆయన కూడా అక్కడకు త్వరలో వెళ్లే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకున్నపుడు తెలుగు రాజకీయాల్లో ఇలాంటి సన్నివేశాలు ఈ రోజు అయినా చూడగలమా అన్న చర్చ అయితే వస్తుంది. ఇద్దరు రాజకీయ నాయకులు కలిసే సీన్ ఇక్కడ ఉండదు, ఇక వారి మీద వీరూ వీరి మీద వారూ విమర్శలు చేసుకోవడమే తప్ప మంచిగా మాట్లాడుకోవడం గడచిన దశాబ్దాలలో చూసినదీ లేదు.
మరి ఇలా రాజకీయం అంటే ప్రత్యక్ష యుద్ధం అని తెలుగు నాట రుజువు చేస్తున్న వేళ తమిళనాడులో స్టాలిన్ మమతల భేటీ మాత్రం సర్వత్రా చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. అంతే కాదు, తెలుగు రాజకీయాలు ఎప్పటికైనా అలా మారుతాయా అన్న ఆలోచన కూడా చేస్తున్న వారు ఉన్నారు. స్టాలిన్ తో పోలిస్తే అంతకంటే ఎక్కువ కాలం సీఎంలుగా చేసిన వారు తెలుగు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన మాదిరి అందరివాడుగా పేరు తెచ్చుకోవడం విషయంలో మాత్రం వెనకబడి ఉన్నారంటే అది నిష్టుర సత్యమే అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.