Begin typing your search above and press return to search.
తన సోదరుడు చేసిన చెత్త పని చెప్పి షాకిచ్చిన సీఎం
By: Tupaki Desk | 7 Jan 2022 4:55 AM GMTఅంచనాలకు తగ్గట్లే.. కొవిడ్ మహమ్మారిఅంతకంతకూ విస్తరిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందన్న నిపుణుల మాటలకు తగ్గట్లే.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటివేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. బాధ్యతగా వ్యవహరించాల్సిన వారే.. తమ బాధ్యతను మర్చిపోయి వ్యవహరిస్తున్న వైనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. తన సోదరుడు ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాడన్న విషయాన్ని వెల్లడించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరిని అవాక్కు అయ్యేలా చేశారు.
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఒక ముఖ్యమంత్రి సోదరుడు కూడా చేరారు. తమ ఇంట్లో ఒకరికి కొవిడ్ అని తేలినతర్వాత కూడా తన సోదరుడు బాధ్యత మరిచి బయట తిరుగుతున్నారని.. అందుకు తాను చింతిస్తున్నట్లుగా చెప్పారు ముఖ్యమంత్రి మమత.
తన సోదరుడు చేసిన పనికి తాను చింతిస్తున్నట్లు చెప్పిన దీదీ.. ‘‘మీ ఇంట్లో ఎవరైనా కొవిడ్ బారిన పడితే.. ఆ విషయాన్ని మర్చిపోయి బయటకు తిరగకండి. మా ఇంట్లోనూ ఒక వ్యక్తి అలా చేశాడు.అందుకు నేను చింతిస్తున్నా. నా సోదరుడి భార్యకు కొవిడ్ పాజిటివ్. కానీ.. నా సోదరుడు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించి బయట తిరుగుతున్నాడు. నాకు అది నచ్చలేదు. దీంతో.. రేపట్నించి ఎక్కడికీ వెళ్లొద్దని మందలించా’’ అని పేర్కొన్నారు.
తాను ముక్కుసూటిగా వ్యవహరిస్తానని ఆమె పేర్కొన్నారు. ఏడురోజుల ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత కూడా తాను కొవిడ్ నిబంధనల్ని పాటిస్తున్నట్లు ఆమె చెప్పారు.ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. మాస్కులు ధరిస్తూ బాధ్యతగా ఉండాలని కోరారు. అంతా బాగానే ఉంది కానీ.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అపర కాళిక అవతారంలా వ్యవహరించే దీదీ.. సోదరుడు అంత చెత్తపని చేస్తుంటే.. నాలుగు తగిలించి.. ఒక మూల కూర్చోబెట్టక.. మందలించటానికే ఒక రోజు సమయం తీసుకోవటం ఏమిటి దీదీ? చూస్తుంటే.. సోదరుడు చేసిన చెత్త పనిని విపక్షాలు గ్రహించి.. దాన్నిరాజకీయం చేసే అవకాశాన్ని ఇవ్వకుండా.. తెలివిగా దీదీనే విషయాన్ని బయటపెట్టేసి.. క్రెడిట్ కొట్టేశారా?అన్న అనుమానం వచ్చిందా? చెప్పలేం.. ఆ కోణంలోనూ ఆలోచించాల్సిందే. ఏ పని ఉత్తినే చేయరు కదా దీదీ మేడమ్.