Begin typing your search above and press return to search.

నందిగ్రామ్ లో ఓడిపోయిన మమత

By:  Tupaki Desk   |   2 May 2021 1:20 PM GMT
నందిగ్రామ్ లో ఓడిపోయిన మమత
X
బెంగాల్ లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమత బెనర్జీ తను పోటీచేసిన నందిగ్రామ్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో దారుణంగా ఓడిపోవడం సంచలనమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మమత బెనర్జీ పార్టీ క్లియర్ కట్ విజయాన్ని సాధించింది. టీఎంసీ అభ్యర్థులు 216 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందారు. సీపీఎం 1 స్థానంలో ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.

కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగాల్ సీఎం మమత వర్సెస్ సువేందు మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఆది నుంచి వీరిద్దరి మధ్య విజయం దోబూచులాడింది. తొలి రౌండ్లలో భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో దూసుకెళ్లారు.

ఒక దశలో సువేందు 9వేల పైచిలుకు ఓట్ల ముందంజలు కొనసాగారు. అయితే తొలుత మమత గెలిచిందని వార్తలు వచ్చాయి. అయితే ఈసీ మాత్రం తాజాగా సువేందు గెలిచాడని ప్రకటించింది.

ఆద్యంతం రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ పోరులో తన సమీప భాజపా అభ్యర్థి సువేందు అధికారి 1622 ఓట్ల తేడాతో దీదీపై గెలుపొందారు.

అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈసీ బీజేపీ ప్రతినిధిలా పనిచేస్తోందని మండిపడ్డారు. నందిగ్రామ్ లో ఓడినా.. రాష్ట్రంలో 221 కు పైగా సీట్లు సాధించామని చెప్పారు. అయితే ఇంకా కౌంటింగ్ అయిపోలేదని.. కొనసాగుతుందని టీఎంసీ తెలిపింది.