Begin typing your search above and press return to search.
ఈసీ నోటీసుకు దీదీ నో రిప్లై.. గడువు పూర్తి.. ఇప్పుడేం జరుగుతుంది?
By: Tupaki Desk | 10 April 2021 4:01 AM GMTఊరంత ఒక దారైతే.. ఉలిపికట్టది మరో దారన్నట్లుగా ఉంటుంది పశ్చిమబెంగాల్ రాజకీయం. ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ కోటపై బీజేపీ జెండా ఎగురవేయాలని మోడీషాలు పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో.. మమతా బెనర్జీ సైతం అంతే మొండిగా ఉన్నారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించటం ద్వారా హ్యాట్రిక్ గెలుపును తన ఖాతాలో వేసుకొని ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. మరే రాష్ట్రంలో లేనంత పోటీ బెంగాల్ లో నెలకొంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. గెలుపు మాత్రమే ప్రామాణికమన్నట్లుగా ఇరు పార్టీలు పోటాపోటీగా ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో ఈసీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి. వీరి కంప్లైంట్లకు స్పందించిన ఈసీ నోటీసులు ఇస్తున్నా.. వాటిని బేఖాతరు అన్నట్లుగా వ్యవహరిస్తున్న దీదీ తీరు సంచలనంగా మారింది. చూస్తుంటే.. బెంగాల్ ఎన్నికల్లో ఎంత రచ్చ చేస్తే.. అంత రాజకీయ లబ్థిని సొంతం చేసుకుంటామన్నట్లుగా వారి తీరు ఉన్నట్లుంది.
తన ఫ్రాక్చర్ అయిన కాలును పదే పదే చూపిస్తూ.. సెంటిమెంట్ అస్త్రంతో ఓట్లను సొంతం చేసుకోవాలని దీదీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు.. ప్రత్యర్థి బీజేపీపై ఆమె చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఉంటున్నాయి. తాజాగా ఆమె చేసిన ఆరోపణే ఇందుకు నిదర్శనం. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని.. భయపెట్టి ఓట్లు వేయించుకుంటోందని ఆరోపించారు. దీదీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఈసీని కలిశారు. దీంతో.. మమతపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారంటూ నోటీసులు జారీ చేసింది. రిప్లై ఇచ్చేందుకు గడువు కూడా పెట్టింది.
అయితే.. ఈసీ ఇచ్చిన గడువును పెద్దగా పట్టించుకోని దీదీ.. తన మానాన తాను అన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం. తనకు ఇచ్చిన నోటీసుల్ని తాను పట్టించుకోనన్నట్లుగా ఆమె తీరు ఉందంటున్నారు. మరి.. ఈసీ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా నాలుగో విడత పోలింగ్ ఈ రోజు జరగనుంది. ఈసారి 44 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికి 91 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా.. ఇందులో 38 స్థానాల నుంచి 63 స్థానాల వరకు బీజేపీ గెలుస్తుందని అమిత్ షా జోస్యం చెబుతుంటే.. సర్వేలు మాత్రం ఈసారికి సెంటిమెంట్ తోదీదీ బయటపడుతుందని చెబుతున్నాయి. తుది ఫలితం మే 2న వెల్లడి కానుంది. బెంగాలీ ప్రజల తీర్పు ఎలా ఉందన్నది ఆ రోజు తేలనుంది.