Begin typing your search above and press return to search.
మమత నోట ఆ వివాదాస్పద సంస్థపై ప్రశంసలు
By: Tupaki Desk | 2 Sep 2022 7:30 AM GMTబీజేపీపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై సమయం దొరికినప్పుడల్లా శివంగిలా విరుచుకుపడే వ్యక్తి.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ పేరు ఎత్తితేనే ఇంతెత్తున మండిపడే మమత తాజాగా బీజేపీ మాతృసంస్థగా చెప్పబడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
దీంతో సహజంగానే ప్రతిపక్షాలకు మమత టార్గెట్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ పై మమత ప్రశంసలను కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఖండించాయి. ఆమెను తీవ్రంగా తూర్పూరబట్టాయి. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. మమత ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి.
మరోవైపు బీజేపీ మమతా బెనర్జీ ప్రశంసలు, పొగడ్తలు తమకేమీ అక్కర్లేదని స్పందించింది. ‘ఆర్‌ఎస్‌ఎస్ అంత చెడ్డది ఏమీ కాదు.. బీజేపీ చేస్తోన్న రాజకీయాలకు మద్దతు తెలపని చాలా మంది ఇంకా ఆర్ఆర్ఎస్ లో ఉన్నారు’ అని పశ్చిమ బెంగాల్ సచివాయలంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.
ఇక మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. 2003లో మమతా బెనర్జీని ఆర్‌ఎస్‌ఎస్ ‘దుర్గ’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. అందుకు బదులుగా ఆర్‌ఎస్‌ఎస్‌ను దేశభక్తులుగా మమత కీర్తించారని గుర్తు చేశారు.
కాగా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ ఆయనపై మండిపడ్డారు. తమది లౌకిక పార్టీ అనే విషయాన్ని ఓవైసీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి సంస్థలోనూ మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉంటారన్నారు. ఇదే విషయాన్ని మమత చెప్పారన్నారు. ఇటీవలి ఎన్నికల్లో భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులను తమ పార్టీ ఓడించిన విషయాన్ని సౌగతరాయ్ గుర్తు చేశారు.
కాగా మమతా బెనర్జీని నమ్మలేమని.. గతంలో ఆమె కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆమె రైల్వే మంత్రిగా చేరారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి విమర్శలు చేశారు. కేవలం ఓట్ల కోసం అవసరమైనప్పుడల్లా ఆయా వర్గాలకు అనుకూలంగా మమతా బెనర్జీ మాట్లాడుతుంటారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కాదనే విషయం మరోసారి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో స్పష్టమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఆర్‌ఎస్‌ఎస్ రూపొందించిన వ్యక్తేనని దునుమాడారు.
ఇక ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కూడా మమత తమపై చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత దాదాపు 60 మందికిపైగా హత్యకు గురయ్యారని విమర్శలు చేసింది. రాజకీయ విభేదాలున్నంత మాత్రాన హత్యలు చేయడం సరికాదంది. పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలపై దృష్టి సారించాలని ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ జిష్ణు బసు సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.