Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు పెరుగుతున్న మ‌ద్ద‌తు..ఇప్ప‌టికే ఓవైసీ-దీదీ

By:  Tupaki Desk   |   4 March 2018 11:31 AM GMT
కేసీఆర్‌ కు పెరుగుతున్న మ‌ద్ద‌తు..ఇప్ప‌టికే ఓవైసీ-దీదీ
X
అవసరమైతే జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు జాతీయ స్థాయి నాయకుల నుంచి అనూహ్య మద్దతు ద‌క్కుతోంది. బీజేపీ అంటే విరుచుకుప‌డే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. కేసీఆర్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇవాళ గులాబీ దళ‌ప‌తితో దీదీ ఫోన్‌ లో మాట్లాడారు. కేసీఆర్ వెంటే నడుస్తామని ఆమె హామీ ఇచ్చారు. దేశరాజకీయాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్న కేసీఆర్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించారు. మరోవైపు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. బీజేపీ - కాంగ్రెస్‌ కు దీటుగా జాతీయస్థాయిలో మరో కూటమి ఏర్పాటు అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఎంపీలు - కూడా మద్దతు పలికారు.

మ‌రోవైపు ఎంఐఎం చీఫ్ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కామెంట్ల‌ను ఆహ్వానించారు. దేశం బీజేపీ - కాంగ్రెస్ ప్రభుత్వాలతో విసిగిపోయిందని - మూడో ఫ్రంట్ రావాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో త‌న పూర్తి మద్దతు కేసీఆర్‌ కు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. `తెలంగాణ సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాను. ఈ దేశం బీజేపీ - కాంగ్రెస్ ప్రభుత్వాలతో విసిగిపోయింది` అని అసద్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ఆయన కొనియాడారు. గత నాలుగేళ్లో కేసీఆర్.. తెలంగాణలో అద్భుతమైన పాలన అందించారు అని అసద్ స్పష్టంచేశారు.