Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్ర‌స్తావ‌నే తీసుకురాని దీదీ!

By:  Tupaki Desk   |   9 March 2018 4:40 AM GMT
కేసీఆర్ ప్ర‌స్తావ‌నే తీసుకురాని దీదీ!
X
ఉద్య‌మ‌నాయ‌కుడికి కొంత‌ అడ్వాంటేజ్ ఉంటుంది. త‌న వాద‌న‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినిపిస్తే స‌రి. త‌మ‌కు బోలెడంత అన్యాయం జ‌రిగింద‌న్న భావ‌న‌కు గురి చేయ‌టమే కీల‌కం. జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే వేళ‌.. త‌మ పోరాటం కార‌ణంగా ఎవ‌రికీ ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌ద‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడే జాతీయ‌స్థాయిలో అంద‌రి మ‌ద్ద‌తు పొందే వీలుంది.

అదే స‌మ‌యంలో జాతీయ కూట‌మిని నిర్మించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అందుకు ఎంతో క‌స‌ర‌త్తు.. అంత‌కు మించిన న‌మ్మ‌కం చాలా అవ‌స‌రం. ఉద్య‌మ‌నేత‌గా జాతీయ రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌టంలో త‌న‌కున్న ట్రాక్ రికార్డు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప‌లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. ఆయ‌న చెప్పినంత ఈజీగా జాతీయ‌కూట‌మిని ఏర్పాటు చేయ‌టం.. అంద‌రిని ఒక తాటి మీద‌కు నిల‌బెట్ట‌టం సాధ్యం కాదన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

దీనికి ఉదాహ‌ర‌ణ‌గా సోరెన్ ఉదంతాన్ని చెప్ప‌క త‌ప్ప‌దు. థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన కేసీఆర్‌కు వెనువెంట‌నే మ‌ద్ద‌తు ప‌లికిన నేత‌ల్లో సోరెన్ ఒక‌రు. కానీ.. మూడు రోజులు గ‌డిచేస‌రికి తాను యూపీఏ కూట‌మిలోనే క‌లిసి ఉంటాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి న‌డుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆ మాట‌కు వ‌స్తే.. ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ త‌న‌కు ఫోన్ చేసిన‌ట్లుగా కేసీఆర్ చెప్పుకున్న‌ప్ప‌టికీ.. అదేమీ నిజం కాద‌ని.. దీదీకి కేసీఆరే ఫోన్ చేశార‌న్న విష‌యం జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది.

త‌న పేరును కేసీఆర్ వాడేసుకున్న తీరు మ‌మ‌త దృష్టికి వెళ్ల‌కుండా ఏమీ పోదు. చిన్న విష‌యానికే త‌న అడ్వాంటేజ్ తీసుకున్న కేసీఆర్ తీరుపై దీదీ ఎలాంటి అభిప్రాయానికి వ‌చ్చి ఉంటార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. దీనికి బ‌లం చేకూరుస్తూ తాజాగా ఒక ఉదంతం చోటు చేసుకుంది. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టి క‌రిపించేందుకు ప్రాంతీయ పార్టీల‌న్నీ క‌లిసి ప‌ని చేయాలంటూ దీదీ పిలుపునిచ్చారు.

ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్ష‌మైన టీడీపీ.. కేంద్ర‌మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నేప‌థ్యంలో దీదీ రియాక్ట్ అయ్యారు. ఏడాది వ్య‌వ‌ధిలో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టిక‌రిపించేందుకు ప్రాంతీయ శ‌క్తుల‌న్నీ ఏకం కావాల‌ని ఆమె పిలుపునిచ్చారు. బెంగాల్ లో ప‌వ‌ర్ లోకి రావాల‌ని బీజేపీ క‌ల‌లు కంటోంద‌ని.. బెంగాల్ కోట గురించి కాదు.. ముందు ఢిల్లీ సీటును కాపాడుకోండంటూ ఆమె సూచ‌న చేస్తున్నారు.

తాజా ప‌రిణామాల‌తో ఎన్డీయేకు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్న‌ట్లుగా చెప్పిన ఆమె.. త్రిపుర‌లో బీజేపీ విజ‌యాన్ని సింఫుల్ గా తీసి పారేశారు. త్రిపుర‌లో అధికార దుర్వినియోగంతో పాటు ధ‌న బ‌లంతో విజ‌యం సాధించారే త‌ప్పించి స్వ‌శ‌క్తితో కాద‌న్నారు. ఇన్ని మాట‌లు చెప్పిన దీదీ.. కేసీఆర్ ప్ర‌స్తావ‌న మాట వ‌ర‌స‌కు తీసుకురావ‌టం చూస్తే.. ఆయ‌న ప్ర‌భావం ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. జాతీయ‌స్థాయిలో త‌న హ‌వా న‌డిపించాల‌ని త‌పిస్తున్న కేసీఆర్ ప్ర‌స్తావ‌న దీదీ తీసుకురావ‌టం చూస్తే ఆయ‌న‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకానున్నాయ‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మ‌రో కీల‌క అంశం ఏమిటంటే.. థ‌ర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ అంత గొప్ప‌గా మాట్లాడిన‌ప్పుడు స్పందించ‌ని దీదీ.. మోడీ స‌ర్కారు నుంచి బాబు త‌న మంత్రుల్ని ఉప‌సంహ‌రించుకున్నంత‌నే రియాక్ట్ కావ‌టం గ‌మ‌నార్హం.