Begin typing your search above and press return to search.
దీదీ నోట ఊహించని మాట వచ్చిందే..
By: Tupaki Desk | 24 March 2017 10:08 AM GMTనిజంగా నిజం. ఎవరూ ఎంతమాత్రం ఊహించని మాట ఒకటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోటి నుంచి వచ్చింది. ప్రధాని మోడీ పేరు ఎత్తినా.. బీజేపీ గాలి తగినా చిరాకు పడిపోయే ఆమె.. బీజేపీకి తన మద్దతు ఇస్తానని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతకూ దీదీ మనసు అంతలా ఎందుకు మారింది? ఏ విషయంలో దీదీ అంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు? అన్నది చూస్తే.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కోసమేనని స్పష్టమవుతుంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థిగా అద్వానీని కానీ నిలిపిన పక్షంలో.. తాము బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.
తాజాగా జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన ఓట్లలో దాదాపు కవర్ అయినట్లుగా చెప్పొచ్చు. మిగిలిన ఓట్లను టీఆర్ ఎస్.. అన్నాడీఎంకే లాంటి పార్టీల సాయంతో గట్టెక్కెచ్చొన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ నోట వచ్చిన మాట ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా ఒక బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. అద్వానీని కానీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి నిలిపితే.. తమ మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కానీ.. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లను రాష్ట్రపతి అభ్యర్థులుగా నిలిపినా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జులై 24న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా అద్వానీనే కన్ఫర్మ్ చేయనున్నట్లుగా బలమైన సంకేతాలు అందుతున్న వేళ.. దీదీ నోటి నుంచి వచ్చిన మాట ఆసక్తికరంగా మారింది. యూపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మోడీ సర్కారుతో ఫ్రెండ్లీగా ఉండటం మంచిదన్న భావనకు దీదీ వచ్చారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/