Begin typing your search above and press return to search.
మోదీని ఆమె ప్రశాంతంగా ఉండనివ్వట్లేదుగా..అక్కడికి వెళ్లినా...
By: Tupaki Desk | 11 Jan 2020 5:45 PM GMTపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)- జాతీయ పౌరపట్టిక(ఎన్ ఆర్సీ) - జాతీయ జనాభా జాబితా(ఎన్ పీఆర్) విషయంలో బీజేపీ ఓ వైపు, ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీలు మరోవైపు అన్నట్లుగా రాజకీయం మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మొదటి నుంచి బలంగా గలం వినిపిస్తున్న రాజకీయ నేత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తాజాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీతో రాజ్ భవన్ వేదికగా భేటీ అయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడ కూడా అదే నినాదం చేశారు. అయితే, ఆమెకు ప్రధాని ఆసక్తికర రిప్లై ఇచ్చారు.
ప్రధానమంత్రితో సమావేశం అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ... సీఏఏ - ఎన్ ఆర్సీ - ఎన్ పీఆర్ లకు తాము వ్యతిరేకమని మోదీతో సమావేశంలో తాను స్పష్టం చేసినట్లు తెలిపారు. తక్షణమే సీఏఏ - ఎన్ పీఆర్ - ఎన్ఆర్సీ లను ఉపసంహరించుకోవాలని కోరినట్లు దీదీ చెప్పారు. బెంగాల్ ప్రజలు ఎన్ ఆర్సీ - సీఏఏలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించరని మోదీకి వివరించాను. వీటిని పునఃసమీక్షించాలని కోరాను. ఐతే తాను పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చానని.. ఢిల్లీలో మరోసారి భేటీకావాలని మోదీ నన్ను ఆహ్వానించారని మమతా పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్‌లో నిరసనలు జరుగుతున్నప్పటికీ వీరిద్దరి భేటీ జరగడం గమనార్హం. మోదీ రాక నేపథ్యంలో సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కోల్‌కతా విచ్చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 12న జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. కౌషల్ వికాస్ కేంద్రం - ప్రీతిలత ఛాత్రి ఆవాస్ ను కూడా ప్రారంభించనున్నారు. అంతకుముందు గవర్నర్ ధన్ కర్ - కోల్ కతా మేయర్ - మంత్రి ఫర్హద్ హకీం - ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు. అయితే, దీనికి మమత హాజరు కాలేదు. పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీతో పాటు మమతా కూడా పాల్గొననున్నారు.