Begin typing your search above and press return to search.
భారత్ లో అనాథ..స్విస్ లో ఎంపీ
By: Tupaki Desk | 19 Jan 2018 12:30 AM GMTఇది ఓ భారతీయుడి విజయగాథ. తీస్తే మంచి సినిమా అవుతుంది.. రాస్తే పెద్ద నవలే అవుతుంది. అలాంటి సక్సెస్ స్టోరీ ఆయనది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేది. స్విట్జర్లాండ్ లో ఎంపీ అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచిన నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్ కథ. ఎందరికో స్పూర్తిని ఇచ్చే పాఠం. భారత విదేశాంగశాఖ నిర్వహించిన భారత సంతతి ఎంపీల కాన్ఫరెన్స్ లో నిక్ తన స్టోరీని వెల్లడించారు. స్థూలంగా చెప్పాలంటే...ఇండియాలో కన్నతల్లి వద్దనుకుంటే స్విస్ కు చెందిన దంపతులు ఆయనను అక్కున చేర్చుకొని, పెంచి పెద్ద చేసి.. ఇప్పుడు ఏకంగా దేశ పార్లమెంట్ లో ఎంపీని చేశారు.
వివరాల్లోకి వెళితే...కర్నాటకలోని ఉడిపిలో ఉన్న సీఎస్ ఐ లాంబార్డ్ మెమొరియల్ హాస్పిటల్ లో 1970 - మే 1న నిక్ జన్మించారు. ఆయన తల్లి పేరు అనసూయ. కానీ పుట్టగానే తాను ఆ బాబు భారం మోయలేనంటూ అక్కడి డాక్టర్ ప్లగ్ ఫెల్డర్ కు అప్పగించి వెళ్లిపోయింది. వారం రోజుల తర్వాత స్విస్‌కు చెందిన ఫ్రిట్జ్-లిజబెత్ దంపతులు ఆ బాబును దత్తత తీసుకున్నారు. నిక్లాస్ అని పేరుపెట్టారు. అక్కడి నుంచి కేరళ వెళ్లి నాలుగేళ్లపాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తమ స్వదేశమైన స్విట్జర్లాండ్ కు వెళ్లారు. అయితే వాళ్లది పెద్దగా డబ్బున్న కుటుంబం కాకపోవడంతో నిక్.. తన చదువు కొనసాగించడం కోసం ట్రక్ డ్రైవర్ గా కూడా పనిచేశారు. చదువు పూర్తయిన తర్వాత సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొనేవారు.
ఇలా చురుకుగా వ్యవహరించే నిక్లస్ 2002లో తొలిసారి వింటర్‌తుర్ అనే సిటీలో కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. అలాఅలా రాజకీయాల్లో తనదైన మార్కు చూపిస్తూ.. గతేడాది నవంబర్‌లో ఏకంగా స్విస్ పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ఆయన. మరో పదేళ్ల పాటు కూడా స్విస్ పార్లమెంట్ లో ఉండబోయే ఏకైక ఇండియన్ ఎంపీని కూడా తానేనని నిక్ వివరించారు. 1992-93లలో తాను అమెరికాలోని కొలంబియాలో ఓ అనాథాశ్రమంలోనూ పనిచేసినట్లు ఈ సందర్భంగా నిక్ చెప్పారు. అంతేకాదు ఇండియా - స్విట్జర్లాండ్ లలో టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించే కేరళలోని ఎన్ టీఐఎఫ్ కు కూడా నిక్ తన సహకారం అందిస్తున్నారు. తనలో ఇండియా - స్విస్ సంస్కృతులు రెండూ ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలోనే మరోసారి ఇండియా వచ్చి.. స్టార్టప్స్ విషయంతో తన ఆలోచనలను పంచుకుంటానని వివరించారు.
కొసమెరుపుః నిక్లాస్ తన కూతురికి అనసూయ అని పేరు పెట్టుకున్నారు. మొదట్లో చెప్పుకున్నట్లు అది ఆయన కన్నతల్లి పేరు. ఆమె జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇన్నేళ్లయినా.. తాను మాత్రం తన తల్లి ఎక్కడుందో తెలుసుకోలేకపోయానని నిక్లాస్ తెలిపారు. కానీ అమ్మను తన బిడ్డలో చూసుకుంటున్నట్లు తెలిపారు.