Begin typing your search above and press return to search.
ఊళ్లు కొట్టుకునే వరకూ వెళ్లిందే
By: Tupaki Desk | 24 May 2015 10:49 AM GMT కంటికి రెప్పలా చూసుకునే కనుపాపలే కాటేస్తే.. ఎవరికి చెప్పుకోవాలి..? రోజులు గడుస్తున్న కొద్దీ దారుణాలు పెరిగిపోతున్న తీరు చూస్తే.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించి.. లక్షలాది మంది మనసుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన అంశం.. కన్నతండ్రే కన్నబిడ్డను అత్యాచారం చేసి అంతమొందించం.
ఈ వ్యవహారం రెండు గ్రామాలు తన్నుకునే వరకూ వెళ్లింది. కన్నకూతురిపై లైంగికంగా దాడి చేసి.. చంపేయటంపై తమ గ్రామాన్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా బంట్వారం మండటం బర్హాద్ గ్రామస్తులు..ఇజ్రాచితంపల్లిపై దాడికి ప్రయత్నించారు.
అయితే.. ఈ దారుణానికి కన్నతండ్రే కారణమని పోలీసులు తేల్చిన నేపథ్యలో.. బర్హాద్ గ్రామస్తులు రగిలిపోతున్నారు. ఎందుకంటే.. ఈ కసాయితండ్రి ఇజ్రాచితంపల్లికి చెందినవాడు. అయితే.. ఈ దారుణకాండ బర్హాద్ గ్రామ సమీపంలో జరగటంతో.. ఆ గ్రామానికి చెందిన వారిదే ఈ పాపం అంటూ కొందరు వ్యాఖ్యలు చేయటం.. దీంతో.. ఆ గ్రామస్తులు కడుపు మండి.. తమపై ఆరోపణలు చేస్తున్న వారిపై దాడికి యత్నించారు.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో స్పందించి కర్రలతో తలపడుతున్న రెండు గ్రామస్తుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల వెళ్లి పరిస్థితి అదుపులోకి తెచ్చేసరికి.. రెండు గ్రామాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. ఒక దుర్మార్గుడు చేసిన దారుణానికి కన్నబిడ్డ బలి కావటంతోపాటు.. రెండు ఊళ్ల మధ్య కొత్త ఘర్షణ మొదలైంది.