Begin typing your search above and press return to search.
బిర్యానీ లేదన్నందుకు ఎంత రచ్చ జరిగిందంటే?
By: Tupaki Desk | 20 Aug 2018 8:29 AM GMTబాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన డాలర్ బిగ్ బాస్ యాడ్ చూశారా? అందులో క్లోజ్ చేశామన్న హోటల్ యజమానిపై దాడికి పాల్పడటం.. హోటల్ ఓనర్ గా ఉన్న అక్షయ్ అతడ్ని చితక్కొట్టేయటం కనిపిస్తుంది. ఇందులో మొదటి సీన్ ఓకే కానీ.. రెండో సీన్ సాధ్యం కాదు. రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి మధ్య తేడా ఉంటుంది కదా. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి సీనే తాజాగా చోటు చేసుకుంది.
అత్తాపూర్ లోని మహిఫిల్ హోటల్ ను బిస్వాల్ సరోజ్ కుమార్ నిర్వహిస్తున్నారు. శనివారం అర్థరాత్రి వేళ అక్కడికి దగ్గర్లోని శివప్రసాద్ అనే వ్యక్తి హోటల్ కు ఫోన్ చేసి బిర్యానీ కావాలని అడిగాడు. బిర్యానీ అయిపోయిందని నిర్వాహకుడు చెప్పాడు. ఎంత చెబుతున్న వినకుండా బిర్యానీ అయిపోయిందంటావా? అంటూ బూతులు తిట్టటం మొదలు పెట్టాడు. దీంతో.. విసుగు చెందిన హోటల్ నిర్వాహకుడు ఫోన్ కట్ చేశాడు.
తన ఫోన్ కట్ చేశాడన్న కోపంతో హోటల్ నిర్వాహకుడిపై దాడి చేశాడు శివప్రసాద్. కాసేపటికే అనుచరులను తీసుకొచ్చి బిస్వాల్ ను బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో.. బిస్వాల్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో మరింత చెలరేగిపోయిన వారు హోటలోని ఫర్నీచర్ తో పాటు బిల్లింగ్ మిషన్.. కుర్చీలు.. అద్దాలను ధ్వంసం చేశారు. తాము లోకల్ అని..ఎప్పుడు వస్తే అప్పుడు బిర్యానీ ఇవ్వాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
మొదట్లో పరిచయం ఉన్న కారణంగా అప్పుడప్పుడు వచ్చి బిర్యానీ తిని.. తర్వాత డబ్బులు ఇచ్చినా ఒప్పుకున్నామని.. ఈ మధ్య కావాలని గొడవకు దిగుతున్నారంటూ బిశ్వాల్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. హోటల్ నిర్వాహకుడిపై దాడి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎంత బిర్యానీ అయిపోయిందంటే మాత్రం.. అంత రచ్చ అవసరమా? అన్న మాట వినిపిస్తోంది. ఈ తరహా వైఖరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది.