Begin typing your search above and press return to search.
కోర్టు ఆవరణలో భార్యను నరికేసిన భర్త
By: Tupaki Desk | 4 Nov 2015 7:28 AM GMTభార్య భర్తల మధ్య గొడవ చివరకు కోర్టు ఆవరణలో హత్యగా మారిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం నాగ సత్యనారాయణ రాజు.. వసుంధరలకు వివాహమైంది. కాలక్రమంలో భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. తాజాగా భర్త వైఖరిపై భార్య పోలీసు కేసు పెట్టింది. దీంతో.. కేసు కోర్టుకు వచ్చింది. కోర్టుకు హాజరు కావాలని సత్యానారయణ రాజుకు నోటీసులు ఇచ్చారు.
దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ రాజు కోర్టు ఆవరణకు వచ్చారు. అక్కడ కనిపించిన భార్య వసుంధరపై తీవ్ర అగ్రహానికి గురయ్యాడు. తన చేతితో తెచ్చుకున్న గొడ్డలితో భార్య మీద దాడి చేశాడు. దీంతో ఆమె ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఊహించని పరిణామంతో కోర్టు ప్రాంగణం మొత్తం భయోత్పాతానికి గురైంది. ఈ హడావుడిలోనే సత్యనారాయణ రాజు తప్పించుకొని పారిపోయాడు. కుప్పకూలిన వసుంధరను హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. కోర్టు హాలులోనే భార్య మీద గొడ్డలితో కోర్టు ప్రాంగణంలోనే దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భార్య మీద దాడి చేసి పరారైన సత్యనారాయణ రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.