Begin typing your search above and press return to search.
విభజన శాపమైందని మరో ఆత్మహత్యాయత్నం
By: Tupaki Desk | 26 Aug 2015 9:38 AM GMTఏపీ రెండు ముక్కలు కావాలని.. అలా అయితేనే తమ భవిష్యత్తు మారుతుందంటూ తెలంగాణకు చెందిన పలువురు యువకులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలు కావొచ్చు.. కాంగ్రెస్ అధినేత్రి నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం సాకారమైంది. విభజన కారణంగా తాము పూర్తిగా దెబ్బ తిన్నామంటూ ఏపీలో ఆత్మహత్యాయత్నాలు మొదలయ్యాయి.
తెలంగాణలో ఉద్యమం ముమ్మరంగా సాగిన సమయంలో పెద్దగా స్పందించిన సీమాంధ్రులు..విభజన తర్వాత.. తమకు నష్టం వాటిల్లిందని.. భవిష్యత్తు తరాలకు విభజన శాపం అవుతుందన్న ఆవేదనతో ఆత్మాహత్యాయత్నాలు షురూ అయ్యాయి. విభజన సందర్భంగా ఏపీకి ఇస్తానన్న ప్రత్యేకహోదా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ.. తిరుపతికి చెందిన మునికోటి ఆత్మాహుతి చేయటం.. ఈ మధ్యనే మరో మాజీ విలేకరి ఆత్మహత్యాయత్నం చేయటం తెలిసిందే.
తాజాగా విభజన వల్ల తాము పూర్తిగా నష్టపోయామని.. తమ భవిష్యత్తు అంధకారం అయ్యిందంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయటం స్థానికంగా సంచలనం రేపింది.
పశ్చిమగోదావరిజిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ హోటల్ నిర్వహిస్తుంటాడు. రాష్ట్ర విభజన కారణంగా తన కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని ఆయన వాపోతున్నారు. గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు తన కుమార్తె నిఖిల ఆరు నుంచి పదో తరగతి వరకూ అక్కడే చదివిందని.. ఆతర్వాత తాడేపల్లి గూడెంలో ఇంటర్.. డిగ్రీ చదివిందని.. ప్రస్తుతం సొంత గ్రామంలో నివసిస్తున్నామని.. అయితే.. ఈ మధ్య విడుదల చేసి డీఎస్సీలో తన కుమార్తె కు అర్హత లేదని చెబుతున్నారని ఆయన చెబుతున్నారు. ఎవరిని కలిసినా ప్రయోజనం లేకపోవటంతో.. విరక్తి చెందిన దుర్గాప్రసాద్.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అతను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏపీ సర్కారు సత్వరమే స్పందించి.. విభజన కారణంగా చోటు చేసుకునే ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.