Begin typing your search above and press return to search.
విమానంలో అడుక్కున్నాడు.. ఏంటా కథ..
By: Tupaki Desk | 23 Jun 2018 5:12 AM GMTఖతర్ దేశానికి చెందిన విమానం అదీ.. దోహా నుంచి షిరాజ్ కు వెళుతోంది. ఆకాశంలో విమానం వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇంతలో ఓ 50 ఏళ్ల పెద్దాయన లేచాడు. ఓ ప్లాస్టిక్ పౌచ్ పట్టుకొని తోటి ప్రయాణికులను అడుక్కోవడం మొదలు పెట్టాడు. రోడ్లపై చూశాం. బస్సులు - రైళ్లలో చూశాం.. కానీ లగ్జరీకి నిదర్శనమైన విమానంలో అడుక్కోవడాన్ని మొదటి సారి చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇంతలో ఎయిర్ లైన్స్ సిబ్బంది వచ్చి అతన్ని అడుక్కోకుండా వారించి ఆయన సీటులో కూర్చోబెట్టారు. చాలా మంది అతడి దీనగాథ చూసి డబ్బులు వేశారు. ఈ వీడియోను తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. విమానంలో అడుక్కునేంత ఖర్మ ఎందుకొచ్చింది అని ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇలా విమానంలో అడుక్కుంటున్న వ్యక్తి ఎవరు.? ఆయన ఎందుకు ఈ పని చేశాడనే దానిపై దన్యల్ గిలానీ అనే పాకిస్తానీ అధికారి వివరాలు వెల్లడించారు. ‘దోహా షిరాజ్ విమానంలో అడుక్కుంటున్న వ్యక్తి పాకిస్తానీ కాదు.. అతను ఒక ఇరానియన్. అతను మాట్లాడుతున్న భాష పార్సీ. అతన్ని ఉన్న ఫళంగా దేశం నుంచి తరిమివేశారు. దాంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఇలా విమానంలో తోటి ప్రయాణికులను అడ్డుకుంటున్నాడు’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అందరూ అతడు పాకిస్తానీ అని కామెంట్స్ చేయడంతో దన్యల్ ఈ వివరణ ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తి తన విమాన టిక్కెట్ ను కొని మరీ ఎక్కాడని.. ఇందుకోసం రూ.55875 రూపాయలు చెల్లించాడని ఖతర్ ఎయిర్ వేస్ తెలిపింది. విమాన టిక్కెట్ కు మాత్రమే డబ్బు ఉండి చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతోనే ఇలా అడుక్కున్నాడని వివరణ ఇచ్చింది. ఇరాన్ దేశం నుంచి బహిష్కరణకు గురైన ఇతడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా విమానంలోనే అడుక్కుంటూ వార్తల్లో నిలిచాడు.