Begin typing your search above and press return to search.

భార్య 'పడక' ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్త..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 3:30 PM GMT
భార్య పడక ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్త..!
X
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న చందంగా సమాజంలో రోజుకు రోజుకు విలువలు పడిపోతున్నారు. తండ్రి కొడుకులు.. తల్లి కూతురు.. అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు ఇలా ఏ రక్త సంబంధం తీసుకున్న ఏముంది గర్వకారణం అన్నట్లుగా మారిపోయింది. సమాజంలో మెజార్టీ ప్రజలు రక్త సంబంధాల కంటే డబ్బుకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటం శోచనీయంగా మారింది.

రక్త సంబంధాలే ఇలా ఉంటే ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి అగ్ని సాక్షిగా మూడు ముళ్ళతో ఒక్కటైన జంటల పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి వివాహ వ్యవస్థకు ఇప్పటికీ చాలా తేడా వచ్చినట్లే మనుషుల ప్రవర్తనల్లోనూ తేడా వచ్చిందని కొన్ని సంఘటనలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

ఓ భర్త తన భార్యను స్నేహితుడితో గడపాలని స్వయంగా కోరడంతో పాటు ఆమె పడక ఫొటోలను తనకే వాట్సాప్ లో పంపి బ్లాక్ మెయిల్ చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. భర్త వేధింపులతో విసిగిపోయిన ఆ భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే..!

కర్ణాటక రాష్ట్రంలోని తనిసంద్ర ప్రాంతంలో జాన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఉన్నత విద్య అభ్యసించిన జాన్ 2011లో ఒక మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె సైతం ఉన్నత చదువులు చదవడంతో వీరిద్దరు ఉద్యోగాలు చేస్తూ సాఫీగా కాలం వెళ్లదీస్తున్నారు. వీరిద్దరికీ రెండేళ్ల బాబు ఉన్నాడు.

అయితే కొంతకాలంగా జాన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే అతడిలో మార్పులు వచ్చాయి. తరుచూ భార్యను అవమానించేవాడు. ప్రతీరోజు మద్యం తాగి ఇంట్లో విధ్వంసం సృష్టించే వాడు. అంతేకాకుండా 2015 నుంచి తన స్నేహితుడితో గడపాలంటూ జాన్ వేధించ సాగేవాడు. దీంతో వీరిద్దరు మధ్య తరచూ గొడవలు జరిగేవి.

జాన్ వేధింపులు భరించలేక ఆమె రెండు మూడు సార్లు తన స్నేహితులిద్దరితో కలిసి సెక్స్ లో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు తెలియకుండా జాన్ ఫొటోలు తీసి మరికొందరితో సెక్స్ చేయాలంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. పదే పదే వారితో సెక్స్ చేయాలని కోరడంతో విసుగు చెందిన భార్య అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అయితే తన స్నేహితులతో గడిపిన ఫోటోలు అందరికీ షేర్ చేస్తానంటూ జాన్ ఆమెను బెదిరించేవాడు. కొన్ని ఫోటోలను భార్య వాట్సాప్ కు షేర్ చేసి విడాకులు ఇస్తే అందరికీ పంపుతానని బెదిరించడంతో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దీనికితోడు 2019లో ఉద్యోగ రీత్య తనతోపాటు కలిసి ఉంటున్న తన సోదరిపై జాన్ కన్నేశాడు.ఆమెను కూడా తన స్నేహితులతో గడేపేలా చూడాలని వేధించడంతో ఆమె విసిగిపోయింది.

ఏదైతే అది అయిందని విడాకులు తీసుకునేందుకు డిసెంబర్ నెలలో జాన్ కు నోటీసులు పంపింది. దీంతో రగిలిపోయిన జాన్ ఆమె ఫోటోలను అందరికీ షేర్ చేస్తానని మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆందోళన గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు తమ శైలిలో భర్తను విచారిస్తున్నారు. ఏది ఏమైనా సమాజంలో ఇలాంటి భర్తలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.