Begin typing your search above and press return to search.
కారు దగ్ధం .. కళ్లముందే సజీవదహనం
By: Tupaki Desk | 20 Feb 2019 4:01 PM ISTహైదరాబాద్ శివారు పటాన్ చెరు-సుల్లాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో కారు నడుపుతున్న వ్యక్తి అందులో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు మేడ్చల్ నుంచి పటాన్ చెరు వైపు వెళ్తోంది. ఈ వాహనం మియాపూర్ కు చెందిన శ్రీదేవి పేరు మీద ఉంది. మృతులు గాయపడ్డ వారి వివరాలతోపాటు ఈ కారు ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.