Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. రాజీనామా చేయాలన్న కుర్రాడు.. కారణం తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 21 Nov 2022 5:32 AM GMTదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా పాపులర్ అయిన మునుగోడు ఉప ఎన్నిక కారణంగా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మైండ్ సెట్ లోనూ మార్పులు వస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరే సంఘటన ఒకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
టీఆర్ఎస్ సర్కారులో నియోజకవర్గం బాగు పడాలన్నా.. బాగు చేయాలన్నా.. వరాలతో ముంచెత్తాలన్నా.. ఉప ఎన్నిక వస్తే కానీ కేసీఆర్ కు పట్టదన్న భావన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దానికి నిదర్శనం ఈ ఉదంతమని చెప్పాలి.
తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ గా మారింది. దాని సారాంశం..అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఒక యువకుడు ఫోన్ చేశాడు. 'మీరు రాజీనామా చేయండి. మునుగోడు మాదిరి భారీ మెజరా్టీతో గెలిపించుకుంటాం. నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుంది' అని పేర్కొన్నారు. దీనికి రియాక్టుఅయిన సదరు ఎమ్మెల్యే.. మునుగోడులో రాజీనామా చేసిన వ్యక్తి గెలిచాడా? అని ప్రశ్నించగా.. సదరు యువకుడి నోట మాట రాలేదు.
యువకుడు తనకే నేరుగా ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరటం.. నియోజకవర్గ డెవలప్ మెంట్ కోసం ఆ పిన చేయాలన్న సూచనకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఆయన అనుచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సదరు యువకుడ్ని గుర్తించిన పోలీసులు.. అతన్ని స్టేషన్ కు తీసుకొచ్చి క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన యువకుడ్ని.. అతడికి స్నేహితుడిగా ఉన్న మరొకరిని కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇలాంటివి మళ్లీ చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది.
స్టేషన్ కు తమ పిల్లల్నిపోలీసులు పిలవటంతో కంగారు పడిన వారి తల్లిదండ్రులు.. వారి బంధువులు సదరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి బ్రతిమిలాడుకున్నట్లు చెబుతున్నారు. తమ పిల్లలు తప్పు చేశారని.. మళ్లీ రిపీట్ కాదన్న హామీ ఇచ్చి క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు తాజా ఉదంతం చెప్పేస్తుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.