Begin typing your search above and press return to search.
ఇదేమి కక్కుర్తిపని వీరభద్రం జీ!
By: Tupaki Desk | 3 Aug 2016 12:21 PM GMTబస్సులోనో - ట్రైన్ లోనో - విమానంలోనో ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీట్లో ఉన్నవారిపట్ల కక్కుర్తి గా బిహేవ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అమెరికా వెళ్లిన విశాఖపట్నం వాసికి తాజాగా తెలిసింది. వీరభద్రరావు అమెరికా వెళ్లాడు, అక్కడ జూలై 30న లాస్ ఏంజెలెస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తోన్న ఫ్లైట్ లో ప్రయాణం చేశాడు. ఆయన పక్క సీట్లో ఒక మహిళ కూర్చోగా - ఆమె పక్కన ఆమె సహచరుడు ఒకరు కూర్చున్నారు. సరిగ్గా విమానం మంచి ప్రయాణంలో ఉన్న సమయంలో అంతా కాస్త కునుకువేస్తున్నారో ఏమో కానీ.. వీరభద్రరావు పక్కనున్న మహిళ మాత్రం నిద్రపోయింది. ఇప్పుడు జరిగింది అసలు సంఘటన!
నిద్రపోతున్న ఆ మహిళ తీరా నిద్రలేచేసరికి వీరభద్ర రావు చేతులు ఆమె జననావయువాలపై ఉన్నాయని, తన కాలుని ఆయన కాలుతో తడుముతున్నాడని ఆ లేడీ అరవడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న సహచరుడు కూడా వీరభద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమాన సిబ్బందికి విషయం అంతా చెప్పాడు. "నీకు కావలసింది ఇస్తాను - డ్రింక్ కొనిపెడతాను జరిగిన దాన్ని మరిచిపో" అని బేరాలాడాడట వీరభద్రం.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పింది బాదిత మహిళ.
విమానం న్యూయార్క్ కు చేరగానే వీరభద్రాన్ని అదుపులోకి తీసుకున్న ఎఫ్.బి.ఐ. పోలీసులు.. అనంతరం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతానికి సుమారు రూ. 33 లక్షల సెక్యూర్ బాండ్ పై వీరభద్రరావుకు బెయిల్ దొరికింది. అయినప్పటికీ ఈయనపై మోపబడిన అభియోగాలు గనుక రుజువైతే మాత్రం దాదాపు ఒక కోటిన్నర రూపాయల ఫైను - రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కూర్చున్నవాడు కుదురుగా కూర్చోక చేసిన కక్కుర్తి పనికి కూనం వీరభద్రరావుకి ఇలా తడిసిమోపెడైంది. ఇంతకీ ఈయన వయసు ఎంతో చెప్పలేదు కదా... 58 ఏళ్లు!