Begin typing your search above and press return to search.

సీఎం భార్య పీఏనంటూ.. ఉద్యోగాల పేరుతో మోసం

By:  Tupaki Desk   |   14 Feb 2020 7:15 AM GMT
సీఎం భార్య పీఏనంటూ.. ఉద్యోగాల పేరుతో మోసం
X
తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పీఏగా పని చేస్తున్నట్లు.. ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే తనను సంప్రదించాలని చెబుతూ అమాయకుల నుంచి డబ్బులు వసూల చేస్తున్న ఓ నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని గొల్లపూడివాసి కుమరేశ్వర అఖిల్ ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పని చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. అయితే 2019 అక్టోబర్ లో తిరుమలలో గదుల కోసం జగదీశ్ సత్యారం ను కలిశారు. అతడితో మాట్లాడి గదులు తీసుకున్నారు. దీంతో అతడిపై వీరికి నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే తనను సంప్రదించాలని, తాను సీఎం జగన్ సతీమణి భారతి పీఏనంటూ చెప్పాడు. వాస్తవమని నమ్మిన అఖిల్ తన ధ్రువపత్రాలతో పాటు రూ. 60 వేల నగదు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఇవ్వాలని చెబుతూ ఇంకా డబ్బులు వసూల్ చేశాడు. మొత్తం రూ.లక్ష 12 వేలు చెల్లించుకున్నాడు.

అయితే ఇటీవల భారతి పీఏ అఖిల్ కాదని తెలుసుకున్న అఖిల్ మరో ఇద్దరు కూడా తన లాగ మోసపోయారని గుర్తించి ఏీపీలోని భవానీపురం పోలీసులను ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎవరికీ డబ్బులు ఇవ్వరాదని పోలీసులు సూచిస్తున్నారు.