Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ కార్య‌క‌ర్త దెబ్బ‌కు రైళ్లు ఆగిపోయాయి

By:  Tupaki Desk   |   21 Aug 2015 10:00 AM GMT
ఏపీ బీజేపీ కార్య‌క‌ర్త దెబ్బ‌కు రైళ్లు ఆగిపోయాయి
X
ఏపీకి చెందిన ఒక బీజేపీ కార్య‌క‌ర్త చేప‌ట్టిన నిర‌స‌న‌తో రైళ్లు ఆగిపోయిన ప‌రిస్థితి. పెద్దపెద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. బంద్ ల స‌మ‌యంలోనూ రైళ్ల‌ను ట‌చ్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌రు. రైల్వేలు కేంద్రం ఆధీనంలో ఉండ‌టం.. రైల్వేల‌కు సంబంధించిన చ‌ట్టాలు క‌ఠినంగా ఉండ‌టంతో ఎంతో పెద్ద అంశం అయితే త‌ప్ప రైళ్ల‌ను ఆప‌టం.. వాటి కార్య‌క‌లాపాల‌కు అంత‌రాయం క‌ల్పించే ప‌రిస్థితి ఉండ‌దు. దీనికి తోడు.. రైళ్ల‌ను ఆపితే.. దూర ప్రాంతాల‌కు చెందిన సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతుంటారు. ఇలాంటి కార‌ణాల‌తో రైళ్ల జోలికి పెద్ద‌గా వెళ్ల‌రు.

అలాంటిది ఏపీకి చెందిన ఒక బీజేపీ కార్య‌క‌ర్త రైళ్ల‌ను ఆపేయించ‌గ‌లిగాడు. క‌డ‌ప జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న ఆరోప‌ణ‌తో జిల్లాలోని నంద‌లూరు వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. హైటెన్ష‌న్ విద్యుత్తు స‌ర‌ఫ‌రా అయ్యే ట‌వ‌ర్ ఎక్కిన అత‌ను వాటిని ప‌ట్టుకొంటాన‌ని బెదిరించాడు.

దీంతో.. బెదిరిపోయిన రైల్వే అధికారులు వెంట‌నే విద్యుత్తు స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ఈ ప‌రిణామంతో రైళ్లు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయిన ప‌రిస్థితి. నంద‌లూరు లోకోషెడ్‌ ను అభివృద్ధి చేయాల‌ని.. ప్రాజెక్టుకు అనుమ‌తులు ఇచ్చి.. స్థానికంగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్న స‌ద‌రు బీజేపీ కార్య‌క‌ర్త పుణ్య‌మా అని రైళ్లు ఆగిపోయిన ప‌రిస్థితి. వెంట‌నే స్పందించిన పోలీసులు.. అత‌డ్ని నిర‌స‌న విర‌మింప చేసి కింద‌కు దించారు. మొత్తానికి ఒక బీజేపీ కార్య‌క‌ర్త త‌న నిర‌స‌న‌తో రైళ్ల‌నే ఆపేసిన ప‌రిస్థితి.