Begin typing your search above and press return to search.
తల్లిని చూసేందుకు వచ్చిన టెకీకి భారీ షాక్
By: Tupaki Desk | 7 Aug 2017 8:37 AM GMTఅమ్మ కోసం అమెరికా నుంచి వచ్చిన ఒక టెకీకి ఊహించని షాక్ ఇప్పుడు సంలనంగా మారింది. తల్లిని చూసేందుకు ఎంతో అతృతగా వచ్చిన ఆ యువకుడు తన తల్లి పరిస్థితిని చూసి భోరున విలపిస్తున్నాడు. ఇంతకీ జరిగిందేమిటన్నది చూస్తే.. ముంబయికి చెందిన రితురాజ్ ఉద్యోగంలో భాగంగా అమెరికాలో ఉంటున్నాడు. ఐటీ ఇంజనీర్ అయిన అతని తల్లి 63 ఏళ్ల ఆశసహాని ముంబయిలో ఉంటున్నారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని లోఖంద్వాల కంప్లెక్స్ లో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త మరణించారు. దీంతో.. ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు.
ఇదిలా ఉంటే.. రితురాజ్ అమెరికాలో ఉంటున్నాడు. తల్లిని చూసేందుకు తాజాగా ముంబయి వచ్చాడు. ఇంటి తలుపు ఎంత కొట్టినా తల్లి తీయకపోవటంతో.. తన దగ్గరి డూప్లికేట్ తాళంతో ఇంటి తలుపు తెరిచాడు. తన తల్లి నిర్జీవ స్థితిలో ఉండటం.. ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉండటం చూసి షాక్ తిన్నాడు.
కోటి కలలతో తల్లిని చూసేందుకు వచ్చిన రితురాజ్‌కు జీవితం ఒక్కసారి శూన్యంగా మారింది. అతన్ని ఆ చుట్టుపక్కల వారు ఓదార్చారు. అనారోగ్యంతో మరణించి ఉంటారని చెబుతున్నారు. ఇంట్లో నుంచి రాకున్నా.. ఇరుగుపొరుగువారు పట్టించుకోకపోవటంతో ఆమె మరణించిన విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని తెలుస్తోంది.
తన తల్లి మరణం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో రంగప్రవేశం చేసిన అధికారులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపారు. ప్రమాదవశాత్తు మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.