Begin typing your search above and press return to search.
అనంతలోకాలకు వెళ్లేముందు ఆఖరి సెల్ఫీ!
By: Tupaki Desk | 10 Nov 2016 4:12 AM GMTమెడకు ఉరితాడు బిగించుకున్నాడు. ఒకచేతిలో సెల్ ఫోన్ అట్టుకుని సెల్ఫీ దిగుతూ.. మరో చేతితో అనుబంధాలకు, ఆప్యాయతలకు, ఈ లోకానికి, తన కష్టానికి టాటా చెబుతూ మృత్యుఒడిలోకి జారుకున్నాడు. అవును... ఆర్థిక ఇబ్బందులతో ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. చివరి శ్వాసను ఫోటోలో బందించాలనో ఏమో... సెల్ఫీ దిగుతూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా చిట్యాల ప్రాంతానికి చెందిన కె.క్రాంతికుమార్ (28) బ్రతుకు దెరువుకోసం భాగ్యనగరానికొచ్చాడు. ఎంతోమందికి బ్రతుకునిస్తున్న హైదరాబాద్ తనకూ తనజీవితానికి తొడుంటుందని భావించాడు.. రామంతా పూర్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొంత కాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్న క్రాంతికి రానురాను ఏమై పోతాననే బెంగపట్టుకుందట. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లగా మంగళవారం రాత్రి ఇంట్లో సెల్ఫీ దిగుతూ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన చావుకు కుటుంబ సమస్యలు - వ్యక్తిగత కారణాలే కారణాలు తప్ప ఎవరూ కారణం కాదని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు! స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోతూ క్రాంతి సెల్ఫీ దిగిన చిత్రాలు సెల్ ఫోన్ లో కనబడ్డాయి. సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్రాంతికుమార్ కు భార్య - కుమారుడు - కుమార్తె ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/