Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా వైరస్ తో ఆత్మహత్య..అసలు కథేంటి?

By:  Tupaki Desk   |   13 Feb 2020 9:45 AM GMT
ఏపీలో కరోనా వైరస్ తో ఆత్మహత్య..అసలు కథేంటి?
X
చైనాలో మరణమృందంగం వినిపిస్తున్న భయకరంమైన కరోనా వైరస్ భయం ఎంత ఉందో తెలిపే దారుణ ఘటన ఇదీ.. కరోనా సోకిందనే భయంతో ఏకంగా ఓ వ్యక్తి కుటుంబానికి కూడా తన వ్యాధి సోకుతుందని భావించి దూరంగా వెళ్లిపోయి బలైన హృదయ విదారక విషాదమిదీ.. చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలం శేషయ్యనాయుడు కండ్రిగ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శేషయ్యనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన బాలకృష్ణయ్య వయసు 50 సంవత్సరాలు.. సాధారణ అనారోగ్యాన్ని కరోనా వైరస్ గా భావించి ఈయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది.

కడుపునొప్పి - గొంతునొప్పి బాధిస్తున్న వేళ.. పేపర్లు - చానళ్లలో కరోనా వైరస్ వార్తలను చూసి భయాందోళన చెందిన బాలకృష్ణయ్య అయోమయానికి గురయ్యాడు. ఫిబ్రవరి 5న తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామను చూసేందుకు వెళ్లాడు. అక్కడే తన కడుపునొప్పి - గొంతునొప్పికి పరీక్షలు చేసుకున్నాడు. మూత్రనాల ఇన్ఫెక్షన్ - నోటి అల్సర్ ఉన్నట్టు వైద్యులు ఇంగ్లీష్ లో తెలిపి మాస్క్ ధరించాలని.. ఇతరులకు వ్యాపిస్తుందని సూచించారు. బాలకృష్ణయ్యకు వైద్యులు ఏం చెప్పారో అర్థం కాలేదు..

అయితే తనకు కరోనా వైరస్ సోకిందని భమ్రపడ్డ బాలకృష్ణయ్య ఇంటికి వచ్చి ‘కరోనా లక్షణాలన్నీ తనలో ఉన్నాయని.. ఇది తెలిస్తే ఊరోళ్లు దగ్గరకు రానీయరని.. మీకు వస్తుందని .. దగ్గరికొస్తే సచ్చిపోతానని ’ బెదిరించాడు. దగ్గరకొచ్చిన కుటుంబ సభ్యులపై రాళ్లతో దాడి చేశాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోంచి వెళ్లి ఆయన తల్లి సమాధి దగ్గర చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా వైరస్ లేకున్నా మందులతో తగ్గిపోయే అల్సర్ - మూత్రనాళ ఇన్ ఫెక్షన్ అయినా సరే బాలకృష్ణయ్య అర్తమయ్యే భాషలో వైద్యులు చెప్పలేదని.. ఆయనకు ఇంగ్లీష్ లో చెప్పడంతో కరోనా అనుకొని అనుమాన పడి చనిపోయాడని.. మాతండ్రి చావుకు రుయా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాలకృష్ణయ్య కొడుకు ఆరోపించాడు.