Begin typing your search above and press return to search.
కన్నింగ్ భార్య.. ప్రాణం తీసుకున్న భర్త..
By: Tupaki Desk | 3 July 2018 10:49 AM GMTకాలం మారింది. క్యారెక్టర్లు మారిపోతున్నాయి. గతంలో భార్యల్ని రాచి రంపాన పెట్టే భర్తలు ఉండేవారు. అత్తమామలు.. ఆడబిడ్డలు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కాకుంటే కాస్త ఛేంజ్. ఇప్పుడు భర్తల్ని చంపేసే భార్యలు.. చంపించే దారుణమైన క్యారెక్టర్లు వచ్చేశాయి.
పురుషులకు తగ్గట్లే కొందరు మహిళల తీరు ఇప్పుడు కొత్త కలకలానికి తెర తీస్తున్నాయి. తాజాగా బెజవాడలో చోటు చేసుకున్న క్రైం అదే తరహాకు చెందింది. పెళ్లి అయ్యాక పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పరాయి మోజులో మొదలయ్యే వివాహేతర సంబంధాలు కాపురాల్ని కూల్చేస్తున్నాయి. కొత్త క్రైంకు తెర తీస్తున్నాయి.
భార్య.. అత్తమామలు వేధిస్తున్నారంటూ బెజవాడలో సూసైడ్ చేసుకున్న గురవారెడ్డి కేసు అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మంచితనం గురవారెడ్డి ప్రాణాల్ని తీసినట్లుగా చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఆయన భార్య గాయత్రికి కార్తీక్ అనే కుర్రాడితో ప్రేమాయణం ఉండటం.. అతడితో సెల్ ఫోన్ సంభాషణలు.. మెసేజ్ లు నిండు ప్రాణం బలయ్యేలా చేసిందని చెప్పాలి.
కార్తీక్ తో ఉన్న సంబంధం గురించి గురవారెడ్డి నిలదీయటం.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి పంచాయితీ నిర్వహించటంతో అనూహ్య మలుపు తిరిగిందని చెబుతున్నారు. తమ కుమార్తె మీద అల్లుడు చేస్తున్న ఆరోపణలు.. చూపిస్తున్న సాక్ష్యాలతో కూతురికి మంచిమాటలు చెప్పాల్సింది పోయి.. రివర్స్ గేర్ లో బెదిరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
అంతేకాదు.. తమ కుమార్తె విషయంపై అల్లుడు చేస్తున్న ఆరోపణలకు కొత్త ఎత్తు వేసి.. తమ కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పోలీసు కేసు పెట్టటం.. గురువారెడ్డిని పోలీసులు స్టేషన్ కు పిలిపించి కొట్టటంతో మనస్తాపానికి గురైన అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు.
అంతేకాదు.. తన చావుకు ముందు సెల్ఫీ వీడియోలో తన భార్య.. అత్తమామలే తన చావుకు కారణంగా చెప్పటం గమనార్హం. ఈ కేసు వ్యవహారం ఇప్పుడు పెను సంచలంగా మారింది. మారిన కాలంలో మనుషుల్లో వస్తున్న అనూహ్య మార్పులు షాకింగ్ గా ఉన్నాయని చెప్పక తప్పదు.