Begin typing your search above and press return to search.
ప్రియురాలి కోసం చస్తా.. ప్రియుడి ఆవేదన
By: Tupaki Desk | 10 Jun 2019 8:20 AM GMTసినిమాల్లో అంతే.. నిజ జీవితంలో అంతే.. అందమైన ప్రేమ కథలో అమ్మాయి తండ్రులే విలన్లుగా మారిపోతుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రేమ కథలోనూ అమ్మాయి తండ్రే అడ్డుగా నిలిచాడు.. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమెను కిడ్నాప్ చేసి ప్రియుడిని పోలీసుల సాయంతో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అష్ట కష్టాలు పడుతున్న ఆ ప్రియుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తన బాధను వెళ్లగక్కాడు. తన ప్రియురాలిని అప్పగించకపోతే చావే శరణ్యమంటున్నాడు.
విశాఖకు చెందిన పొన్నాన ప్రభాస్ హైదరాబాద్ కూకట్ పల్లిలో బీఎఫ్ ఏ చదువుతున్నాడు. డిసెంబర్ లో అదే ప్రాంతంలోని లోధా అపార్ట్ మెంట్ లో ఉంటున్న తన్వి అనే యువతితో ప్రభాస్ కు పరిచయం ప్రేమగా మారింది. తల్లిదండ్రులను కాదని తన్వి-ప్రభాస్ లు ఫిబ్రవరి 15న శ్రీనగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు.
కూతురు పెళ్లి చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు కక్ష పెంచుకున్నారు. కూతురుతో మంచి గా మాట్లాడి వారు ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి మారేలా చేశారు. చివరకు నమ్మించి తన్విని నిర్భందించి పెళ్లి సాక్ష్యాలను మాయం చేసి ప్రభాస్ ను పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్ లోనే ప్రభాస్ ను తన్వి తండ్రి - ఆయన సన్నిహితులు చితకబాదారు. పోలీసులు కూడా తన్వి తండ్రికి సపోర్టుగా ప్రభాస్ ను హింసించారు. ప్రభాస్ తల్లిదండ్రులకు విషయం తెలిసినా వారు పట్టించుకోలేదు.
ఇలా భార్య పోయి.. కన్న వారు కాదని ప్రభాస్ ప్రస్తుతం మీడియాకు ఎక్కాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తన ఆవేదనను మీడియాకు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని హోంమంత్రిని - కమిషనర్ ను కోరుతున్నాడు. ఈ ప్రియుడి విరహ వేదనను పోలీసులు అర్థం చేసుకుంటారా.,? లేక కాలదన్నుతారా అనేది వేచిచూడాల్సిందే..