Begin typing your search above and press return to search.

కోడిపందాల్లో దారుణం.. కోడికత్తికి బలి

By:  Tupaki Desk   |   16 Jan 2020 8:05 AM GMT
కోడిపందాల్లో దారుణం.. కోడికత్తికి బలి
X
సంక్రాంతి పండుగ పూట విషాదం నెలకొంది. సంక్రాంతి కోడిపందాల్లో ఓ వృద్ధుడికి కోడి కత్తి తగిలి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా జరిగిన కోడి పందాల్లో సరిపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చనిపోవడం విషాదం నింపింది.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించారు. సహజంగానే సంక్రాంతికి గోదావరి జిల్లాలో కోడిపందాలు జోరుగా జరుగుతుంటాయి. ఈ కోవలోనే పందాలను చూడడానికి సరిపల్లి వెంకటేశ్వరరావు వచ్చారు. కోడి కాళ్లకు కత్తులు కడుతుండగా పక్కనే వెంకటేశ్వరరావు నిలబడ్డారు. కోడి ఎగరడంతో కోడి కత్తులు వెంకటేశ్వరరావు తొడలోకి చొచ్చుకెళ్లాయి. కోడికత్తులు షార్ప్ గా ఉండడంతో పెద్దగాయమై రక్తస్రావమై వెంకటేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

ఇలా సంక్రాంతి పండుగ వెంకటేశ్వరరావు ఇంట విషాదం నింపింది. కోడి పందాలతో జీవనాధారం కోల్పోయామని ఆ కుటుంబం రోదించిన తీరు కలిచివేసింది. సరదా కోసం నిర్వహించిన కోడిపందాలు ఒకరి ప్రాణం తీయడంతో ప్రగడవరం గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.