Begin typing your search above and press return to search.

క్లోరోక్వైన్ డ్రగ్ తీసుకొని భర్త మృతి - భార్య పరిస్థితి విషమం

By:  Tupaki Desk   |   24 March 2020 4:11 PM GMT
క్లోరోక్వైన్ డ్రగ్ తీసుకొని భర్త మృతి - భార్య పరిస్థితి విషమం
X
క్లోరోక్వైన్ డ్రగ్ మలేరియా చికిత్స కోసం ఉపయోగిస్తారు. హైడ్రోక్సీక్లోరోక్వైన్ కీళ్ల వాతము వంటికి ఉపయోగించే మందు. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ డ్రగ్స్ పేరును సూచించడంతో అందరి నోళ్లలో నానుతున్నాయి. కరోనా వ్యాధి ట్రీట్మెంట్ కోసం హైడ్రోక్సీక్లోరోక్వైన్ - అజిరోమిసిన్ కలిపి తీసుకోవడంపై ఆయన ఇటీవల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ - వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లినికల్ రీసెర్చ్ చేయాలని చెప్పాయి.

ఈ డ్రగ్స్ పరిశోధనపై చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి - అతని భార్య కరోనా భయంతో క్లోరోక్విన్‌ ను ఉపయోగించారు. కానీ వారు అనారోగ్యం పాలయ్యారు. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య పరిస్థితి క్రిటికల్‌ గా ఉంది.

అదే సమయంలో చైనా లోపినావీర్-రిటోనావిర్ కాంపినేషన్ డ్రగ్స్ కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి ఈ మందులు హెచ్ ఐవీ రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఐతే ఇదే డ్రగ్స్ ఉపయోగించి జైపూర్ ఆసుపత్రిలో ఇటాలియన్ పర్యాటకులకు నయం చేసినట్లు డాక్టర్లు తెలిపారు.