Begin typing your search above and press return to search.

పాపం వృద్ధుడు.. అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయాడు

By:  Tupaki Desk   |   25 Aug 2019 5:27 AM GMT
పాపం వృద్ధుడు.. అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయాడు
X
అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. దైవ దర్శనానికి వచ్చి మూడు మునకలు కృష్ణలో మునిగిన ఆ వృద్ధుడు తిరిగి లేవలేకపోయాడు. కొట్టుకుపోయి మరణించాడు. ఎలాంటి ముందస్తు సమాచారం.. హెచ్చరికలు లేకుండా ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసిన అధికారుల నిర్లక్ష్యానికి ఒక ముసలి ప్రాణం పోయింది.

తాజాగా ప్రకాశం బ్యారేజీ గేట్ల మధ్యలో ఒక నాటు పడవ ఇరుక్కొని నీరు అంతా వృథాగా పోతోందని మీడియాలో కథనాలు రావడంతో నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ లు ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లి ఆ నాటు పడవను తీసేందుకు ఒక్కసారిగే గేట్లుఎత్తారు. కానీ కిందనున్న ముంపు ప్రాంతానికి సమాచారం ఇవ్వలేదు..

కిందనున్న ఘాట్ ఒడ్డున ఉన్న శనీశ్వరుడి ఆలయానికి వచ్చిన వృద్ధుడు కృష్ణా ఘాట్ లో స్నానం చేస్తుండగా పెద్ద ఎత్తున వచ్చిన కృష్ణా నది వరద ప్రవాహం విడుదలై వృద్ధుడు కొట్టుకుపోయాడు.. మంత్రి అనిల్ వెంటనే గుర్తించి పోలీసులు - మత్య్సకారులను కాపాడాలని ఆదేశించాడు. వారు వెంటనే పడవలో కొట్టుకుపోతున్న వృద్ధుడిని సీతమ్మవారి పాదాల వద్ద రక్షించి ఒడ్డుకు చేర్చారు. కానీ నీటిలో మునిగి సృహతప్పిన వృద్ధుడు కొద్దిసేపటికే మరణించాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని స్థానికులు మండిపడుతున్నారు.