Begin typing your search above and press return to search.

కరోనా హృదయ విదారకం.. చస్తున్నా పట్టించుకోలేదు..

By:  Tupaki Desk   |   25 March 2020 11:10 AM GMT
కరోనా హృదయ విదారకం.. చస్తున్నా పట్టించుకోలేదు..
X
కరోనా విజృంభణతో కరీంనగరం కకావికలం అవుతోంది. కరీంనగర్ లో పర్యటించిన 9మంది ఇండోనేషియన్లకు కరోనా సోకడం.. వారితో తిరిగిన యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా నగరంలోని కశ్మీర్ గడ్డ రైతుబజార్ కు కూరగాయల కోసం వచ్చిన ఒక వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలి మరణించాడు.

అయితే సిటీలో కరోనా భయంతో ఇతడు కూడా కరోనాతో చచ్చిపోయాడని భావించిన జనం పాపం అతడి దగ్గరకు కూడా రాలేని దైన్యం కనిపించింది.

మృతదేహం వద్దకు వెళ్లడానికి భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు.

కరోనా కారణంగా ఇప్పుడు ఎవరు కాస్త అనుమానంగా కనిపించినా కరీంనగర్ జనాలు వణికిపోతున్నారు. గుండెపోటు తో కుప్పకూలిన వ్యక్తిని సైతం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడికక్కడే చనిపోయిన దారుణం చోటుచేసుకుంది. కరోనా భయం మనుషులను ఎంత నిర్ధయగా మారుస్తుందనడానికి ఈ ఘటన ప్రధాన ఉదాహరణగా నిలిచింది.