Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో...యువకుడి కారు బానెట్ పై పోలీస్ హాహాకారాలు
By: Tupaki Desk | 2 May 2020 4:00 PM GMTకరోనా మహమ్మారి కట్టడి కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న పోలీసుల పట్ల ఓ యువకుడు వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా... కారును ఆపమన్నందుకు ఏకంగా ఏఎస్సైని తన కారుతో గుద్దేసి... ఆ తర్వాత సదరు ఏఎస్సై తన కారు బానెట్ పై పడ్డా... ఆ ఉల్లంఘనుడు ఆగలేదు. బానెట్ పై ఏఎస్సై పడి హాహారాకాలు చేస్తున్నా పట్టించుకోకుండా కారును ముందుకు దూకించిన ఈ ఘటనలో సదరు యువకుడి దుర్మార్గం నిజంగానే కళ్లకు కడుతోంది. తాను చేసిన ఈ దుర్మార్గానికి ఆ తర్వాత సదరు యువకుడు మూల్యం చెల్లించక తప్పలేదనుకోండి. అయినా ఆ యువకుడి దుర్మార్గంతో ప్రాణభయంతో కారు బానెట్ పై పడిన పోలీసు అధికారి చేసిన హాహాకారాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే పంజాబ్ లోని జలంధర్ లో 20 ఏళ్ల అన్మోల్ పెహ్మి అనే విద్యార్థి తన తండ్రికి చెందిన బ్లాక్ ఎర్టిగా కారును తీసుకుని రోడ్డెక్కాడు. యువకుడు కదా... నిబంధనలను తుంగలో తొక్కేసి వేగంగా దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసే పనిలో ఉన్న పోలీసులు అతడి కారును అడ్డగించే యత్నం చేశారు. ఈ క్రమంలో అన్మోల్ కారు ముందుకు వచ్చిన ఏఎస్సై ముల్క్ రాజ్ కారును ఆపాలంటూ యువకుడికి సూచించారు. అయితే ముల్క్ రాజ్ సూచనలను బేఖాతరు చేస్తూ అన్మోల్ కారును ముందుకు దూకించాడు. ఈ క్రమంలో కారు ఢీకొనడంతో ముల్క్ రాజ్.. కారు బానెట్ పై పడ్డారు. అయినా కూడా కారును ఆపని అన్మోల్... ఏఎస్సై తన కారు బానెట్ పడ్డా కూడా కారును ముందుకే దూకించాడు. ఈ క్రమంలో ప్రాణభయంతో ముల్క్ రాజ్ హాహాకారాలు చేసినా అన్మోల్ ఏమీ పట్టనట్టుగానే వ్యవహరించాడు.
అయితే ఎలాగోలా కారును నిలువరించిన మిగిలిన పోలీసులు... బానెట్ పై నుంచి ముల్క్ రాజ్ ను సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత అన్మోల్ ను కారు నుంచి బయటకు లాగేసి అక్కడే దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ముల్క్ రాజ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. అన్మోల్ దురాగతంలో ఊగిపోయిన పోలీసులు అతడికి దేహశుద్ధి చేసిన అనంతరం అతడిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కారు ఓనర్ గా ఉన్న అన్మోల్ తండ్రి పర్మీందర్ కుమార్ పైనా కేసు నమోదు చేశారు. కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా అహోరాత్రులు పనిచేస్తున్న పోలీసుల పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ... అన్మోల్ దుర్మార్గపు చర్యకు చెందిన 90 సెకన్ల వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వీడియో కోసం క్లిక్ చేయండి