Begin typing your search above and press return to search.
బెడ్రూంలో ఫోన్ చార్జింగ్ పెట్టిన పాపానికి..
By: Tupaki Desk | 3 April 2017 8:16 AM GMTగతంలో మాదిరి కాదు.. ఇవాల్టి రోజున సెల్ ఫోన్ పక్కన లేకుండా నిమిషం కూడా గడవలేని పరిస్థితి. నిత్యం సెల్ ఫోన్ అప్ డేట్ చూసుకోవటం ప్రతిఒక్కరికి అలవాటుగా మారింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక.. ఛార్జింగ్ సమస్యల నేపథ్యంలో.. కాసింత టైం ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టేయటం చాలామంది చేస్తుంటారు. ఈ అలవాటులో భాగంగా.. ఫోన్ కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది బెడ్రూంలో ఛార్జింగ్ కు పెట్టేస్తుంటారు. అలా చేసిన ఒకతనికి ఎదురైన అనుభవం విన్నప్పుడు.. కరెంటు షాక్ కొట్టినంత భయానికి గురి కావటం ఖాయం. అంతేకాదు.. బెడ్రూంలో ఫోన్ ను ఛార్జింగ్ పెట్టటం ఎంత ప్రమాదమో ఈ ఉదంతం చెబుతుంది.
అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. 32 ఏళ్ల విల్ డే అనే యువకుడు అమెరికాలోని హంట్స్ విల్లేలో ఉంటాడు. అప్పుడప్పుడు బెడ్రూంలో తన ఐఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకునే అలవాటు ఇతని సొంతం. ఈ మధ్యన అదే రీతిలో తన ఐఫోన్ ను బెడ్ మీద పెట్టి.. ఛార్జింగ్ పెట్టేసి నిద్రలోకి జారుకున్నాడు. మాంచి నిద్రలో ఉన్న వేళ.. అతగాడి మెడలోని నెక్లెస్.. ఐఫోన్ ఛార్జర్ వైర్‌కు తగలటంతో షాక్ కొట్టింది. తీవ్ర విద్యుద్ఘాతానికి గురైన విల్ డే ఫ్లోర్ మీద గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు. వెంటనే చెయిన్ తెంపుకొని.. కారు డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు.అతనికి తగిలిన గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. అతను బతకటం నిజంగా అద్భుతమని ప్రశంసిస్తున్నారు.
ఇక.. తనకు తగిలిన గాయం గురించి చెప్పుకొచ్చిన విల్ డే మాటలు వింటే భయంతో వణకటం ఖాయం. షాక్ కొట్టినప్పుడు మెడ చుట్టూ బండ వేసి బిగించినంత పనైందని.. ఒళ్లంతా ఒక్కసారిగా మొద్దుబారిందని.. తాను పడుతున్న బాధ పగోడికి కూడా పడొద్దని చెప్పుకొచ్చాడు. ఎవరూ తన మాదిరి బెడ్ మీద ఫోన్ ను చార్జింగ్‌కు అస్సలు పెట్టొద్దన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/