Begin typing your search above and press return to search.
చెవిలో బొద్దింక పాతిక గుడ్లు పెట్టింది!
By: Tupaki Desk | 31 Aug 2015 4:09 PM GMTచెవిలో చిన్న చీమ దూరినా, కొద్దిపాటి నొప్పి వస్తేనే విలవిల్లాడిపోతారు! అటువంటిది ఒక కుర్రాడు చెవిలో బొద్దింకల స్థావారమే ఉంటే... బాద ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా తెలిసిన ఈ విషయం విని అంతా ఆశ్చర్యపోతున్నారు. బొద్దింకను దూరంగా చూస్తేనే... హిట్ అడుగుతారు! అటువంటిది బొద్దింకల్ని చెవిలో పెట్టుకుని ఇంతకాలం ఎలా ఉన్నాడో తెలియక వైద్యులు తలలు పట్టుకున్నారు!
విషయానికి వస్తే... చైనాలో 19ఏళ్ల మిస్టర్ లీ కి కుడిచెవి బాగా నొప్పి పెడుతుంది. రోజు రోజుకీ చెవి బాద పెరిగిపోవడంతో సొంత వైద్యం మానుకుని.. వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ చెవినొప్పికి గల కారణం తెలిసి ఆశ్చర్యపోయాడట! కారణం... ఆ యువకుడి చెవిలో ఒక బొద్దింక కాపురం పెట్టింది. ఆ ఆడబొద్దింక కాపురం పెట్టి ఖాళీగా ఉంటుందా... చెవిలోపల గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఆ గుడ్లు ఖాళీగా ఉంటాయా... పిల్లలుగా మారాయి. వాటి సంఖ్య ఎంతో తెలుసా... అక్షరాలా 25!
చెవిలో బొద్దింకలకు చిన్నసైజు నివాసగృహం ఏర్పాటుచేసిన లీ ని చూసిన వైద్యులు ఆశ్చర్యపోతూ... ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది... మరి కొన్ని రోజులు ఇలానే అశ్రద్ధ చేసి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని చెబుతున్నారట. నిద్రపోయేటప్పుడు చెవిలో దూదులు పెట్టుకుని పడుకోవయ్యా "లీ" అని సలహాలు ఇస్తున్నారట తోటి చైనీయులు!