Begin typing your search above and press return to search.
అందరూ చూస్తున్న వేళ రైల్వేస్టేషన్లో దారుణం
By: Tupaki Desk | 23 Feb 2018 6:04 AM GMTఈ వీడియో అందరికి మేలుకొలుపు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ దారుణం చెబుతుంది. పట్టపగలు.. చుట్టూ అందరూ ఉన్నారని అనుకోవటం పెద్ద తప్పే అవుతుందన్నది ఈ వ్యవహారం స్పష్టం చేస్తుంది. ముంబయి మహానగరంలోని ఒక రైల్వేస్టేషన్లో ఉదయం పదకొండు గంటల వేళలో ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే అసభ్యంగా వ్యవహరిస్తూ ముద్దు పెట్టిన వైనం షాకింగ్ గా మారింది.
ఇంత జరుగుతున్నా.. చుట్టూ ఉన్న వాళ్లు వింత చూస్తున్నట్లుగా చూస్తే.. మరికొందరు అసలు పట్టనట్లుగా ఉండటం గమనార్హం. సంచలనంగా మారిన ఈ వ్యవహారంలోకి వెళితే.. గురువారం ఉదయం 11. 20 గంటల వేళలో ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ నవీ ముంబయిలోని టర్బే రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. ఫ్లాట్ ఫాం మీద వెళుతున్న ఆమె వెనుక నుంచి తాపీగా వచ్చిన ఒక వ్యక్తి అనూహ్యంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ తిన్న ఆమె.. అతడ్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ తన ప్రయత్నం మానుకోలేదు. గట్టిగా తోసేసిన ఆమె.. కింద పడిన బ్యాగును తీసుకొని పైకి లేచేసరికి వచ్చినంత తాపీగానే తిరిగి వెళ్లే వైనం రైల్వేస్టేషన్లోని సీసీ కెమేరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది.
తనకు ఎదురైన చేదు అనుభవాన్నిఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి స్టేషన్ బయట నుంచే వెంబడించినట్లుగా సదరు మహిళ చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే.. సదరు మృగాన్ని పోలీసులు గుర్తించారు. 43 ఏళ్ల నరేష్ కే జోషిగా తేల్చిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చుట్టూ జనాలు ఉన్నారని భరోసాతో ఉండొద్దన్న హెచ్చరికను తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.