Begin typing your search above and press return to search.
అప్పు తీర్చేందుకు ఏ భర్త చేయని ఘోరం చేశాడు
By: Tupaki Desk | 14 Oct 2019 6:47 AM GMTఅప్పు తీర్చేందుకు కలలో కూడా ఊహించలేని దారుణానికి పాల్పడ్డాడో భర్త. బెడ్రూంలోకి స్నేహుతుడ్ని పంపి.. బయట గొళ్లెం పెట్టేసిన వైనం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సంచలంగా మారటమే కాదు.. ఇంత నీచానికి పాల్పడిన వైనంలోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఒక నీచుడు మిత్రుడి దగ్గర అప్పు తీర్చాడు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే అతడు.. సహ ఉద్యోగి వద్ద నుంచి తరచూ అప్పు తీసుకునేవాడు. అతడి భార్య మీద కన్నేసిన సహోద్యోగి అడిగినంత ఇచ్చేవాడు.
ఇద్దరూ కలిసి నిత్యం మద్యం సేవించటం.. పేకాట ఆడేవారు. ఇలా సహోద్యోగి కాస్తా స్నేహితుడిగా మారిపోయాడు. పెరిగిపోయిన అప్పును ఒకేసారి తీర్చేందుకు వీలుగా దారుణమైన ప్రపోజల్ పెట్టాడు. నీ భార్యతో గడిపే అవకాశం ఇస్తే.. అప్పు మొత్తం తీరిపోయినట్లేనని చెప్పాడు. దీనికి ఓకే అన్న అతను.. దారుణమైన పథకాన్ని వేశాడు.
ఎప్పటిలానే పేకాట ముగిసిన తర్వాత.. ఆ రోజు తన స్నేహితుడు ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పి.. భోజనం వండించాడు. భోజనం చేశాక.. బెడ్రూంలోకి భార్య వెళ్లిన తర్వాత స్నేహితుడ్ని పంపి.. బయట గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. నిద్ర పోతున్న తనపై చేయి వేసింది భర్త కాదన్న అనుమానం వచ్చిన ఆమె.. భర్త స్నేహితుడన్న విషయాన్ని గుర్తించి పెద్ద ఎత్తున కేకలు వేసింది.
తీవ్రంగా ప్రతిఘటించింది. దారుణానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్న అతడ్ని బలవంతంగా అడ్డుకుంది. ఫోన్లో తనకు జరుగుతున్న అన్యాయం గురించి పోలీసులకు చెప్పటంతో.. వారు వచ్చి ఆమెను రక్షించారు. భర్త స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భర్తను అరెస్ట్ చేశారు. కేసునమోదు చేసి విచారిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలంటారు?