Begin typing your search above and press return to search.
ఈ వార్త చదివినప్పుడు మోడీ మీద కోపం పక్కా
By: Tupaki Desk | 27 Nov 2016 7:33 AM GMTకొన్ని సందర్భాలు అంతే. సంబంధం లేకున్నా చుట్టుకుంటుంటాయి. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం కూడా అలాంటిదే. నిజానికి ప్రధాని మోడీకి ఈ వ్యవహారంతో నేరుగా ఎలాంటి సంబంధం లేదు. కానీ.. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఒక వ్యక్తి మీద పడిన ప్రభావం.. అందుకు అతగాడు స్పందించిన తీరు చూసినప్పుడు బాధ కలుగుతుంది. ఆవేశం రావటమే కాదు.. అంతిమంగా ఇలాంటి పరిస్థితికి కారణమైన మోడీ మీద కోపం కలగటం ఖాయం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ కొరత ఎదుర్కొంటున్న వైనం తెలిసిందే.
నోట్ల రద్దు పుణ్యమా అని.. పనుల మీద.. బడుగుజీవుల ఆదాయం మీదా చాలానే ప్రభావం పడింది. రియల్ ఎస్టేట్ లాంటి రంగాలైతే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. మిగిలిన రంగాలపైనా దీని ప్రభావం పడింది. వీధిలో ఉండే చిన్న టిఫిన్ సెంటర్ మొదలు.. స్టార్ హోటల్ వరకూ నోట్ల రద్దు ప్రభావం పడింది. ఇలా పడిన ప్రభావంతో చాలానే సమస్యలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన పురాణ్ శర్ ఉదంతమే చూస్తే.. ఇదే తీరులో ఉంటుంది.
నోట్ల రద్దు కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో పని దొరకని పరిస్థితి. దీంతో.. డబ్బు అవసరం చాలా పెరిగిపోయింది. దీని కోసం ఏం చేస్తే బాగుంటుందన్న విషయం మీద ఆలోచించిన అతనికి.. చిత్రమైన ఐడియా వచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే కొంత డబ్బులు వస్తాయన్న విషయాన్ని తెలుసుకున్న అతను.. ఆసుపత్రికి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇందుకుగాను అతనికి అక్కడి వైద్యాధికారులు రూ.2వేలు ఇచ్చారు. ఈ వ్యవహారం బయటకు వచ్చి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రద్దునిర్ణయంతో ఇలాంటి తిప్పులెన్నో సామాన్యుల మీద పడుతుందంటూ మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు మండిపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/