Begin typing your search above and press return to search.

విషాదంగా బ‌ర్త్ డే పార్టీ: స‌్టంట్ ప్రాణాల మీద‌కొచ్చింది..!

By:  Tupaki Desk   |   8 Jun 2020 12:30 AM GMT
విషాదంగా బ‌ర్త్ డే పార్టీ: స‌్టంట్ ప్రాణాల మీద‌కొచ్చింది..!
X
ప్ర‌స్తుతం లాక్‌ డౌన్‌ తో శుభ‌కార్యాలు - వార్షికోత్స‌వాలు - జ‌న్మ‌దిన వేడుక‌లు అన్ని ర‌ద్ద‌య్యాయి. ఆనందోత్స‌వాల మ‌ధ్య జ‌న్మ‌దిన వేడుక చేసుకుంటుండ‌గా అనుకోకుండా చేసిన ఓ ప‌ని బ‌ర్త్ డే వ్య‌క్తి ప్రాణం మీద‌కు వ‌చ్చింది. హంగూఆర్భాటాల‌తో గ్రాండ్‌ గా ఏర్పాటుచేసిన పార్టీ విషాదంగా మారింది. త‌న బ‌ర్త్‌ డే వేడుక‌లో ఓ వ్య‌క్తి చేసిన‌ స్టంటు అత‌డిని ఆస్ప‌‌త్రి పాల‌య్యేలా చేసింది. ఈ ఘ‌ట‌న రష్యాలో చోటుచేసుకుంది.

మాస్కోకు చెందిన బ్యాంక్ ఉద్యోగి డిమిర్టీ ప్రిగారోడోవ్ త‌న 30వ జ‌న్మ‌దినోత్స‌వాన్ని స్నేహితుల‌తో క‌లిసి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన పార్టీలో అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో బ‌ర్త్ డే చేసుకుంటున్న డిమిర్టీ ప్రిగారోడోవ్‌ కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. కిటికీలో నుంచి స్విమ్మింగ్ పూల్‌ లో దూకి ఈత కొట్టాల‌ని నిర్ణ‌యించాడు. వెంట‌నే కిటికిలోంచి కింద‌కు దూకాడు. అయితే స్విమింగ్ పూల్ మీద ఉన్న గాజు ఫ‌ల‌కం అత‌డికి గుర్తులేదు. కిటికీలోంచి ఒక్క‌సారిగా దూక‌డంతో గాజు ప‌లిగిపోయి అత‌డి శ‌రీరంలోకి చొచ్చుకెళ్లింది. ముఖం - ఛాతీపై తీవ్ర గాయాల‌య్యాయి. అత‌డిని వెంట‌నే స్నేహితులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సాహ‌సం చేయ‌డానికి వెళ్లి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డం అవ‌స‌రమా అని ఈ వీడియోను చూసిన వారంతా అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది.