Begin typing your search above and press return to search.
మధ్యతరగతి ఇంటికి రూ.3,419 కోట్ల బిల్లు.. షాక్‌తో ఆస్పత్రిపాలైన ఇంటిపెద్ద!
By: Tupaki Desk | 27 July 2022 10:33 AM GMTబీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అధికారుల తప్పిదంతో ఒక మధ్యతరగతి ఇంటికి ఏకంగా రూ.3,419 కోట్ల బిల్లు వచ్చింది. దీంతో ఆ షాక్ తిన్న యజమాని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పొరపాటుతో ఇలా వచ్చిందని.. అసలు కరెంటు బిల్లు రూ.1300 అని అధికారులు తెలపడంతో ఆ కుటుంబం ఊపిరిపీల్చుకుంది.
ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగర శివ్‌విహార్ కాలనీలో ప్రియాంక గుప్తా కుటుంబం నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల కరెంటు బిల్లును కొద్ది రోజుల క్రితం విద్యుత్ అధికారులు వారి ఇంటికి వచ్చి అందించారు.
దీంతో బిల్లు చూసిన కుటుంబ పెద్ద తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. విద్యుత్ బిల్లు ఏకంగా రూ.3,419 కోట్లు ఉండటం ఆందోళన చెందిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయిన ఆయన కిందపడిపోయాడు. దీంతో కంగారుపడ్డ ప్రియాంక కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా ఇంటిపెద్ద కుమారుడు సంజీవ్ కంకణె మాట్లాడుతూ తమకు జూలై 20న విద్యుత్ సిబ్బంది బిల్లు అందించారని తెలిపారు. అయతే బిల్లు రూ.3,419 కోట్లు రావడం చూసి విద్యుత్ అధికారులను సంప్రదిస్తే వారు మొదట మీరు వాడుకున్నంతే బిల్లు వచ్చిందని.. అంతా కట్టాల్సిందేనని తెలిపారన్నారు. దీంతో ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ స్టేట్ పవర్ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు. దీంతో జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు ఆ విద్యుత్ బిల్లును రూ.1,300గా మార్చారని చెప్పారు.
కాగా సాంకేతిక తప్పిదంతోనే బిల్లులో తేడాలు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు బిల్లు పంపిణీకి వచ్చిన ఉద్యోగి సాఫ్ట్‌వేర్‌లో 'యూనిట్లు' అని ఉన్నచోట పొరపాటున వినియోగదారుడి సర్వీస్ సంఖ్యను వేశారని అంటున్నారు.
దీంతో బిల్లు రూ.కోట్లలోకి వెళ్లి పోయిందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తప్పు చేసిన సంబంధిత విద్యుత్తు ఉద్యోగిపై చర్య తీసుకుంటామని మధ్యప్రదేశ్ విద్యుత్తు శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ తెలిపారు.