Begin typing your search above and press return to search.
షాకింగ్: లక్ష పెట్టి మద్యం కొన్న మహానుభావుడు...ఎక్కడంటే !
By: Tupaki Desk | 5 May 2020 12:10 PM GMTకరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే , కరోనా కంట్రోల్ కి రాకపోవడంతో మరోసారి కొన్ని ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తూ లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించారు. గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం అమ్మకాలపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో వైన్ షాప్స్ ఓపెన్ చేసారు. ఇంత కాలం చుక్క కోసం ఎదురుచూస్తున్న మందుబాబులకు ఈ వార్త కిక్కు ఇచ్చినంత పని అయ్యింది. ఇంకేముంది పొద్దున్నే లిక్కర్ షాపుల ముందు జనం బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఎంతో ఓర్పుగా లైన్లలో నిలబడి మద్యం బాటిళ్లు ఇంటికి తీసుకెళ్లారు.
అసలే 45 రోజలుగా చుక్క పడక గొంతు తడారిపోయిన మందు బాబులు ఏకంగా లక్షలు, వేలు పోసి మందు బాటిళ్లు తీసుకెళ్లారు. బెంగుళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రూ. లక్ష ఖర్చు చేయగా.. మరో వ్యక్తి రూ. 52 వేలు ఖర్చు చేశాడు. దీనికి సంబంధించిన బిల్లులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిబంధనల ప్రకారం ఒక్క రోజులో 2.6 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లేదా లేదా 18 లీటర్ల బీర్ మాత్రమే ఒక వినియోగదారుడికి అమ్మాలి.
కానీ వాటిని లెక్క చేయకుండా ఒక్క వ్యక్తి వేలు, లక్షలు పెట్టి మద్యం అమ్మడంతో అనుమానం వచ్చిన ఎక్సైజ్ అధికారులు ఆయా దుకాణం యజమానులుపై కేసులు నమోదు చేశారు. అయితే దుకాణదారులు మాత్రం 8 మంది వినియోగదారులు కలిసి ఒకే కార్డు ద్వారా బిల్లు మొత్తం చెల్లించినట్టు తెలిపాడు. దీని ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా ఇలా భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడి కావడంతో అధికారులు నిఘా పెట్టి ఉంచారు. ఏదేమైనా కూడా లక్ష రూపాయలకి మందు కొనడం గమనార్హం.