Begin typing your search above and press return to search.
వీడు... సగం మనిషి, సగం మృగం!
By: Tupaki Desk | 21 July 2015 1:00 PM GMTమనిషి మనిషిగా ఉంటే మనిషి అంటారు... మనిషి మృగంగా మారుతుంటే ఏమనాలి? మృగం అని అనలేం... ఎందుకంటే అవి ఉదరపోషణ నిమిత్తం మృగాలుగా మారతాయి తప్ప మానసిక ఆనందంకోసమో, మానసిక వికలాంగులు అవ్వడం వల్లనో మృగాలుగా మారవు! కానీ... ఒకమనిషి తోటి మనుషులను... అది కూడా చిన్న పిల్లలను అత్యంత కర్కశంగా, హత్య చేస్తుంటే... ఏమనాలి! ఆరేళ్ల చిన్నారులపై కూడా హత్యాచారాలు చేసేస్తుంటే ఏమి చెయ్యాలి, బాలురను అత్యంత దారుణంగా చంపేస్తుంటే ఏమనాలి... పేరు ఏమిపెట్టినా కానీ... ఇతడు యూపీ లోని రవీందర్ కుమార్!! చూడటానికి మనిషిలా ఉంటాడు, లోపల మృగం స్వభావం కలిగి ఉంటాడు! సగం మనిషి... సగం మృగం!
ఉత్తరప్రదేశ్ లోని కాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన రవీందర్ కుమార్ తాను ప్రస్తుతం నివశిస్తున్న దేశ రాజధాని ఢిల్లీలో కిరాతకుడయ్యాడు. సుమారు 30 మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు! వీడి వయసు 24 ఏళ్లు!! 2008 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు! అది ప్రవృత్తో, వ్యసనమో లేక మరేమైనానో తెలియక వీడి చరిత్ర అంతా తెలుసుకున్న పోలీసులు తలలు పట్టుకున్నారు. మనమధ్యే తిరుగుతూ, మనమధ్యే బ్రతుకుతూ ఇంత దారుణమైన వ్యక్తులు సమాజంలో పుష్కలంగా ఉన్నారన్న చేదు నిజం నమ్మక తప్పదు!
తాజాగా దక్షిణ ఢిల్లీలోని ఒక బాలుడిని అపహరించి హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించాడు! అయితే ఆ బాలుడు ప్రాణాలతో బయట పడటంతో... అసలు విషయం బయటకు వచ్చింది! అనధికారిక లెక్కల ప్రకారం ఇతడి చేతిలో బలైన చిన్నారుల సంఖ్య సుమారు 40 వరకూ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు!