Begin typing your search above and press return to search.
సగం దేశానికి ఆ ఒక్కడే కరోనా అంటించాడట!
By: Tupaki Desk | 20 July 2020 12:30 AM GMTకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. ఇదిప్పుడు గ్లోబల్ సమస్యగా మారింది. చైనా నుంచే అన్ని దేశాలకు ఈ వైరస్ పాకింది. తాజాగా శ్రీలంక ప్రభుత్వం సంచలన విషయాన్ని ప్రకటించింది. అదిప్పుడు వైరల్ గా మారింది.
శ్రీలంక దేశంలో సగం మందికి కరోనా వైరస్ సోకడానికి ఒకే వ్యక్తి కారణమని స్వయంగా శ్రీలంక ప్రభుత్వమే ప్రకటించడం సంచలనంగా మారింది. అతడి ఫొటోలను సోషల్ మీడియా - టీవీ - పత్రికల ద్వారా ప్రసారం చేసి.. అతడిని దేశంలో తలదించుకునేలా అవమానించింది. తాను ఏ తప్పు చేయలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
శ్రీలంక రాజధాని కొలొంబోకు 12మైళ్ల దూరంలో ఉన్న జాయేలా పట్టణంలో నివసిస్తున్న ప్రసాద్ దినేష్ (33) ఊహించని విధంగా వాళ్ల దేశంలో కరోనా విలన్ గా మారిపోయాడు.అతడి వల్ల ఆ పట్టణంలో నేవీ సిబ్బంది.. పోలీసులతోపాటు మొత్తం 1100మందికి కరోనా సోకిట్లు అధికారులు తెలిపారు. వారి వల్ల దేశంలోని ఇతర ప్రాంతాలు.. వ్యక్తులకు కూడా కరోనా వైరస్ వ్యాపించిందని తెలిపారు.
దినేష్ ను కరోనా ‘పేషంట్ 206’గా శ్రీలంకలో పాపులర్ అయ్యాడు. స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడంతో అతడు తలెత్తుకోలేకపోతున్నాడు.
కొబ్బరికాయలను దొంగతనం చేసి విక్రయిస్తుండగా దినేష్ దొరికిపోయాడు. ఆ సొమ్ముతో డ్రగ్స్ కొనుగోలు చేస్తానని దినేష్ విచారణలో తెలిపాడు. శ్రీలంకలో డ్రగ్స్ కొనడం తీవ్రమైన నేరం. దీంతో పోలీసులు దినేష్ ను జైల్లో పెట్టారు. వారం తర్వాత దినేష్ కు జ్వరం, దగ్గు, జలుబు వచ్చింది. టెస్ట్ చేస్తే కరోనా అని తేలింది. దినేష్ వల్ల పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కోరనా సోకింది. అక్కడ వైద్యశిబిరం నిర్వహించగా సేవలందించేందుకు నౌకదళం నేవి సైలర్లు వచ్చారు. వారికి కరోనా సోకింది. నేవీలో వీరి ద్వారా 900మందికి వ్యాపించింది. ఇలా ఒకరి నుంచి ఒకరికి దినేష్ వల్ల బాగా వ్యాపించిందని కాంటాక్టుల ద్వారా తెలుసుకున్న శ్రీలంక ప్రభుత్వం అతడి వల్లే సగం దేశానికి కరోనా అంటిందని తేలింది. ప్రస్తుతం దినేష్ కరోనా నుంచి కోలుకుంటున్నారు.