Begin typing your search above and press return to search.
1000 లైక్స్ కొట్టకుంటే పిల్లాడ్ని చంపేస్తా!
By: Tupaki Desk | 21 Jun 2017 8:53 AM GMTప్రస్తుతం చిన్నా - పెద్దా తేడా లేకుండా చాలా మంది సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. తమ పోస్ట్‌లకు ఎన్ని లైక్ లు - కామెంట్లు వచ్చాయి? ఎంత మంది షేర్ చేసుకున్నారు? తదితర అంశాలకు అధిక ప్రాధాన్యాన్నిస్తున్నారు. ఈ క్రమంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేందుకు సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి.
కొందరైతే ఫేస్ బుక్ లో లైక్స్ కోసం ఎంతటి వికృత చేష్టలకైనా పాల్పడుతున్నారు. ఈ లైక్స్ కోసం అల్జీరియాలోని ఓ తండ్రి ఏకంగా తన కన్న కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టాడు. తన బాబును 15వ అంతస్తు కిటికీలో నుంచి కిందకి పడేయబోతున్నట్టు ఫోటో తీశాడు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసి 1000 లైక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే అలానే ఆ బాబును కింద పడేస్తానంటూ క్యాప్షన్ పెట్టాడు.
ఆ కన్న తండ్రి పైశాచికత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే అతడిని అరెస్టు చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. ఆదివారం పోలీసులు అతడిని అరెస్టు చేసి, అల్జీరియా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు వెంటనే అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఏఐ అరేబియా న్యూస్ సైట్ రిపోర్టుచేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/