Begin typing your search above and press return to search.

అది చూసి ఆ రైల్వేస్టేషన్ వణికిపోయింది

By:  Tupaki Desk   |   20 July 2016 4:15 PM GMT
అది చూసి ఆ రైల్వేస్టేషన్ వణికిపోయింది
X
ఎదురు చూస్తున్న రైలుబండి రానే వచ్చింది. అల్లంత దూరాన కనిపించిన ట్రైన్ కళ్ల ముందుకు వచ్చేస్తున్న క్షణాల్లో.. ట్రైన్ ఆగటం ఆలస్యం ఎక్కాలన్న ఆలోచనలో ఉన్న వారంతా ఒక్కసారిగా వణికిపోయారు. భయంతో కేకలు వేశారు. రైలు ఎక్కేందుకు ఒక్క అడుగు ముందుకేసినోళ్లంతా నాలుగు అడుగులు వెనక్కి వేయటమే కాదు.. వణికిపోయిన పరిస్థితి. ఇంతకీ ఏమైంది?రైల్వే స్టేషన్లో ఉన్న వారంతా వణికిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే..?

రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి ప్రాంతంలోని హజారీలాల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనను ప్రత్యక్షంగా చూసినోళ్లే కాదు.. ఆ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ను వీక్షించే వారు సైతం ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. అప్పటివరకూ తమతో ఉన్న ఒక యువకుడు ఫ్లాట్ ఫామ్ దగ్గరకు వస్తున్న ట్రైన్ వస్తున్న వేళ చటుక్కున దూకేయటమే కాదు.. పట్టాల మీద తన తల పెట్టటం.. ట్రైన్ వెళ్లిపోవటం క్షణాల్లో జరిగిపోయింది.

ఊహించని ఈ సీన్ చూసినోళ్లంతా ఒక్కసారి వణికిపోయారు. నాలుగు అడుగులు వెనక్కి వేశారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్త 30ఏళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. సూసైడ్ చేసుకున్న యువకుడు ఎవరు? ఎక్కడి వాడు? అన్న వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.