Begin typing your search above and press return to search.

రియల్ లైఫ్ ‘‘అనుక్షణం’’

By:  Tupaki Desk   |   20 July 2015 6:12 AM GMT
రియల్ లైఫ్ ‘‘అనుక్షణం’’
X
ఆ మధ్య రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనుక్షణం సినిమా గుర్తుందా? ఒక సైకోకిల్లర్ కారణం లేకుండా.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా చంపేయటం చూశాం. రీల్ లైఫ్ లో వణికించిన సైకోను మించి నరహంతకుడి ఉదంతం ఒకటి తాజాగా బయటకు పొక్కింది.

ఆరేళ్ల వ్యవధిలో దాదాపు 14 మంది చిన్నారుల్ని అత్యంత పాశవికంగా చంపేసిన మానవ మృగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విస్మయం కలిగించే అంశం ఏమిటంటే.. అతగాడు.. గతంలో ఒకసారి పోలీసుల చేతికి చిక్కి.. జైలుకు వెళ్లి.. బెయిల్ పొంది వెళ్లిపోయాడు. తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ విచారణలో అతగాడి హంతక కోణాన్ని బయటకు తీశారు.

తాను చంపిన వారి లిస్ట్ చెబుతుంటే.. పోలీసులకు సైతం నోట మాట రాని పరిస్థితి. తాను చేసిన అకృత్యాల్ని తాపీగా చెబుతున్న ఈ సైలెంట్ కిల్లర్ దారుణాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి.

యూపీకి చెందిన బదయా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల రవీందర్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీ శివారుల్లో ఉంటున్నాడు. చిన్న పిల్లలకు చాక్లెట్ల ఆశ చూపించి వారిని అపహరించటం.. వారిని లైంగికంగా వేధించటం.. వారిని అత్యంత క్రూరంగా చంపేయటం లాంటివి రవీంద్రకుమార్ చేసేవాడు. ఆరేళ్ల చిన్నారి కనిపించని ఉదంతంలో రవికుమార్ ఇంటికి 50 మీటర్ల దూరంలో శవమైన ఘటనలో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించిన సందర్భంగా ఈ మానవ మృగానికి సంబంధించిన నిజం బయటకు వచ్చాయి. గతంలో ఇతనిపై దొంగతనం నేరం మీద అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్ పొంది బయటకు వచ్చేశాడు. తాజాగా ఇతగాడి బండారం బయటకొచ్చింది.