Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ ఫ్రెండ్ ని..ముక్కలు చేసి ప్యాక్ చేసింది
By: Tupaki Desk | 5 May 2018 8:36 AM GMTఅరచేతిలో స్మార్ట్ ఫోన్....కారుచౌకగా మొబైల్ డేటా అందుబాటులో ఉండడంతో సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలాడి వరకు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఖాతాలు తెరిచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యువత ఎక్కువగా చురుగ్గా ఉంటున్న నేపథ్యంలో నకిలీ ఫేస్ బుక్ ఖాతాల మోసాలు, బెదిరింపులు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీలో ఈ నేపథ్యంలోనే దారుణ హత్య జరిగింది. సోషల్ మీడియా యాప్ లో పరిచయమైన ఓ యువకుడిని.....యువతితో పాటు ఆమె స్నేహితులు కిరాతకంగా హత్య చేశారు. డబ్బుల కోసం ఆ యువకుడిపై వల విసిరిన కిలేడీ.....ఆ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి రోడ్డుపై పడేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ప్రస్తుతం..ఆ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు కటకటాలపాలయ్యారు.
ఢిల్లీకి చెందిన దుశ్యంత్ శర్మ(29) కు సోషల్ మీడియా యాప్ లో ప్రియా సేథ్ (27) అనే యువతి పరిచయమైంది. బజాజ్ నగర్ లో ఉన్న తన ఫ్లాట్ కు దుశ్యంత్ ను ప్రియ ఆహ్వానించింది. స్నేహితురాలని కలుద్దామని వెళ్లిన దుశ్యత్ కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. దీక్షంత్(25), లక్ష్యా వాలియా(26)...అనే ఇద్దరు యువకులతో కలిసిన ప్రియ....దుశ్యంత్ ను గదిలో నిర్బంధించింది. పది లక్షలు డబ్బు ఇవ్వాలని....లేకపోతే రేప్ కేసు పెడతానని బెదిరించింది. ఏటీఎం దగ్గరకు తీసుకువెళ్లి దుశ్యంత్ తండ్రికి ఫోన్ చేయించిన ఆ ముగ్గురు....10 లక్షలు డిమాండ్ చేశారు. మొదట మూడు లక్షల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయగా....నిందితులు 2లక్షలు డ్రా చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత దుశ్యంత్ ను నిందితులు పాశవికంగా హత్య చేశారు. దుశ్యంత్ ను ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి రోడ్డుపై పడేశారు. స్థానికుల సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు...ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇటువంటి హనీ ట్రాప్ లు ఉంటాయని...యువత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.